గిడుగు రామమూర్తి తెలుగు భాష కు విశిష్ట సేవలు అందించిన మహనీయుడు. ఘనంగా మాతృభాషా దినోత్సవం.
నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి: మాతృభాషా దినోత్సవాన్ని నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కళాశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.విద్యారాణి మాట్లాడుతూ తెలుగు భాష అనేది ప్రజల భావాలకు అనుగుణంగా ఉండాలని వాళ్లకి అందరికీ అర్థమయ్యే రీతిలో రాయగలగాలని అందుకే వాడుక భాష చాలా అవసరమని గిడుగు రామమూర్తి భావించారని తెలిపారు. ఆయన తెలుగు భాషకు చేసినటువంటి విశిష్ట సేవలకు చిహ్నంగా వారి జన్మదినం అయినటువంటి ఆగస్టు 29 న మాతృభాష దినోత్సవం గా జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నా మన మాతృభాషకు సాటి రాదని మరియు ఆ భాషలలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మన భాషలోకి మార్చుకొని ప్రపంచ పటం లో మన భాషను నిలబెట్టాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం సుష్మ, నాగరాజు,శివ, నాగలింగం, రాదా కుమారి, స్వప్న, రామకృష్ణ, రవికుమార్,ప్రవలిత, హమీద్,మహేశ్వర్ జి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.