గిరిజనుల్లో మావోలకు ఆదరణ కరువు


గిరిజన ప్రాంతాల భూ సమస్యలపై ప్రభుత్వం దృష్టి
ఏపీ`ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులును అరెస్ట్‌
విూడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచిన డిజిపి సవాంగ్‌
అమరావతి,అగస్టు12(జనం సాక్షి): ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరువైందన్నారు. గిరిజన ప్రాంతాల్లోని భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని, గత రెండేళ్లుగా అనేక సంక్షేమ పథకాలు గిరిజనులకు అందుతున్నాయని గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఏపీ`ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల అరెస్ట్‌ కు సంభందించి గురువారం ఏపీ
డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ విూడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీ`ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులును అరెస్ట్‌ చేసినట్లు డీజీపీ తెలిపారు. డివిజనల్‌ కమాండర్‌ సహా మరి కొంత మంది కీలక నేతలు ఉన్నట్టు ఆయన చెప్పారు. మావోయిస్టు కీలక నేత గాదర్ల రవి పోలీసులుకు లోంగిపోయినట్టు ఆయన పెర్కోన్నారు. ఆరుగురు కీలకమైన మావోయిస్టులు లొంగిపోయారని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ వెల్లడిరచారు. ఏఓబీ లో మావోయిస్టు పరిస్ధితులను గత నెలలో సరెండర్‌ అయిన స్పెషల్‌ జోనల్‌ కమాండర్‌ చెప్పారని ఈ నేపథ్యంలో ఒక డివిజనల్‌ కమాండర్‌, ఇద్దరు కమాండర్లు, ముగ్గురు ఇతర మెంబర్లు లొంగిపోయారని డీజీపీ గౌతం సవాంగ్‌ పేర్కొన్నారు. గత నెలలో లొంగిపోయిన స్పెషల్‌ జోనల్‌ కమాండ్‌ చెప్పిన వివరాల కారణంగా మిగతా వారి వివరాలు తెలిశాయన్నారు డీజీపీ. అరెస్ట్‌ అయిన వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే గన్‌ మెన్లు ఉన్నారని తెలిపారు. స్థానిక సమస్యలు ప్రభుత్వం పరిష్కరించడం తో మావోయిస్టు ప్రాబల్యం తగ్గిందన్నారు. భూమి సమస్యలు కూడా ఇప్పుడు లేవని 19,919 కుటుంబాలకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న సామాజిక కార్యక్రమాలు ఆదివాసీ ప్రాంతలకు చేరుతున్నాయని వెల్లడిరచారు. ఇక మిగతా మావోయిస్టుల పై కూడా ప్రస్తుతం నిఘా పెట్టామని చెప్పారు. ఏఓబీలో మావోయిస్టుల ప్రాబల్యం చాలా వరకు తగ్గిందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. గత నెలలో లొంగిపోయిన స్పెషల్‌ జోనల్‌ కమాండర్‌ ఇక్కడి పరిస్థితిని పోలీసులకు చెప్పారని ఆయన వివరించారు.ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తుండటంతో బేస్‌ ఏరియాల్లో సైతం మావోయిస్టుల ప్రభావం తగ్గినట్లు నివేదకలు చెబుతున్నాయి. రక్తపాతం ద్వారా సమస్యలు పరిష్కారం కావని ఆదివాసీలకు అర్ధమైంది. విద్య, వైద్యం సమస్యలు ఆదివాసీలకు ఇప్పుడు లేవు. స్టీల్‌ ఎª`లాంట్‌ ప్రైవేటీకరణ కోసం పోరాడదామని మావోయిస్టులు పిలుపునిచ్చినా గిరిజనులు ఆసక్తి చూపట్లేదు. గతంలో ఏవోబీలో 8 మావోయిస్టు కమిటీలు ఉండేవి ఇప్పుడు 4 కమిటీలు కూడా లేవు. అనేకమంది మావోయిస్టులు ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. గ్రావిూణ, గిరిజన ప్రాంతాలకు ప్రభుత్వ కార్యక్రమాలు బాగా చేరుతున్నాయి. వలంటీర్ల వ్యవస్థ బాగా పని చేస్తుంది. నేరుగా లబ్దిదారులకు పథకాలు అందుతున్నాయి. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలోనూ అనేక మార్పులు వచ్చాయి. పోలీసుల భాష, ప్రవర్తన మారింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మావోయిస్టులకి ఆదివాసీల మద్దతు లేదు. రిక్రూట్‌మెంట్‌కు ఏపీ యువత ముందుకు రాకపోవడంతో ఛత్తీస్‌ ఘడ్‌ నుంచి నియమించుకుంటున్నారు. స్థానిక సమస్యలపై, తెలుగు భాషపై వాళ్లకు అవగాహన లేకపోవడంతో కేవలం తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారు. వాళ్లలో చాలామంది లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు’ అని డీజీపీ తెలిపారు.