గిరిజనేతరుల సమస్యలపై చిన్నచూపు తగదు

ఆదిలాబాద్‌,మే28(జ‌నం సాక్షి):  ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు ఎదుర్కొంటున్న పహాణీ, భూ సమస్యల పరిష్కారం చూపాలని గిరిజనేతులరు సంఘం నేతలు అన్నారు. ఎన్నికల్లో ఓట్లు వేసుకున్న నాయకులు అధికారంలోకి వచ్చాక గిరిజనేతరుల సమస్యలను పట్టించుకోకపోవడం బాధకరమని గిరిజనేతులరు సంఘం నేతలు అన్నారు. ఎంతోకాలంగా ఇక్కడే పుట్టి ఇక్కడే జీవిస్తున్న వారి మస్యలను పట్టించుకోవాలని అన్నారు. తమ పోరాటం ఆదివాసీ గిరిజనులకు వ్యతిరేకం కాదన్నారు. వారి హక్కులకు భంగం కల్గకుండానే తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.  అవసరమైతే తమ సమస్యల కోసం పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని ఆ సంఘం జిల్లా నాయకులు పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి గిరిజనేతరులు సాగుచేస్తున్న భూములకు పహాణీలు ఇచ్చేవారని ప్రస్తుతం వాటిని ఆపేయడంతో రుణాలు లభించక గిరిజనేతరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తోందన్నారు.  ఇక్కడే పుటుటి ఉంటున్న వారిపట్ల ఇలాంటి వివక్ష తగదన్నారు. భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో మరో సమావేశాన్ని ఏర్పాటుచేసి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. తమసమస్యలపై పోరాటాలుచేస్తున్నా నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. ఇది తీవ్రం కాకముందే అధికారుల మేల్కొనాలన్నారు.

తాజావార్తలు