గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం నందు ఆశ్రమ పాఠశాలలు
జనం సాక్షి ప్రతినిధి మెదక్క్, సెప్టెంబర్ 13, 2022
క్రీడల ద్వారా శారీరక దారుడ్యంతో పాటు ఎంతో ఉల్లాసంగా ఆరోగ్య వంతులుగా ఉంటారని, చదువులలో కూడా చురుకుగా రాణిస్తారని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మంగళవారం జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం నందు ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహ విద్యార్ధి,విద్యార్థులకు ఏర్పాటు చేసిన డివిజనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ 2022-23 లో మాట్లాడుతూ జట్టుగా ఆడితే విజయం తధ్యమని అన్నారు. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్పూర్తితో ఆడాలని అన్నారు. క్రీడల ద్వారా విద్యార్థులలోని నైపుణ్యాన్ని బయటకు తీయటంతో పాటు వారి మేధాశక్తిని పెంపొందించినవారమవుతామని అన్నారు. క్రీడల ద్వారా విద్యార్థులలో ఉన్న అలక్ష్యాన్ని తొలగించడంతో పాటు వారిలో నూతనోత్తేజం నింపగలుగుతామని తద్వార విద్యతో పాటు పలు కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనగలుగుతారని అన్నారు. నేటి వాలీబాల్ , కబడ్డీ, కో కో వంటి క్రీడలలో చురుకుగా రాణించాలని, ఇందులో గెలుపొందిన వారు ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లడం జరుగుతుందని అన్నారు.
జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కేశురాం మాట్లాడుతూ డివిజనల్ స్థాయి క్రీడలలో మొత్తం 9 గిరిజన ఆశ్రమ / హాస్టల్ విద్యార్థిని విద్యార్థులు 7 క్రీడా పోటీలలో పాల్గొన్నారని గెలుపొందిన టీం లను జోనల్ స్థాయి పోటీలకు పంపుతామని అన్నారు. . ఈ క్రీడా పోటీలు విద్యార్థులలో శారీరక ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయని క్రీడా స్ఫూర్తి ద్వారా అన్ని రంగాలలో వారిని చైతన్య వంతులను చేయగలిగిన వారమవుతామని అన్నారు.
అనంతరం విద్యార్థులకు నిర్వహించిన ఆయా క్రీడలలో గెలుపొందిన విజేతలకు -బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో DYSO నాగరాజు, ABCDO నాగరాజు గౌడ్, ZPHS PDలు శ్రీనివాస్ రావు, మదు, మాధవరెడ్డి, మహిపాల్, స్వాతి, శివరాం, సంతోష్, వసతి గృహ సంక్షేమ అధికారులు, హాస్టల్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు