గిరిజన అమర వీరులకు నివాళి
ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో గిరిజన అమర వీరులకు తుడుముదెబ్బ ప్రతినిధులు నివాళులు అర్పించారు. అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా ఇంద్రవెల్లిలో పోలీసు ఆంక్షలు ఉన్నప్పటికీ తుడుముదెబ్బ కన్సీనర్ శ్రీరాంసంభూ, గిరిజన నాయకురాలు కొముర ఈశ్వరి ఉట్నూరు నుంచి వచ్చి అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి వెళ్లిపోయారు. సంస్మరణ దినం సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పోలీసులు ఇంద్రవెల్లిలో 144 సెక్షన్ పెట్టారు.