గిరిజన చిన్నారి పసి మొగ్గల జీవితాలతో వెట్టిచాకిరి .
గిరిజన విద్యార్థినులపై విద్యాశాఖ సవితి ప్రేమ.
పిడిఎస్ యు వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్ రెడ్డి.
తాండూరు డిసెంబర్ 18(జనంసాక్షి)గిరిజన చిన్నారి పసి మొగ్గల జీవితాలతో వెట్టిచాకిరి
చేయిస్తున్నారని పిడిఎస్ యు వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్ రెడ్డి పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్ ప్రభుత్వ నెంబర్ వన్ పాఠశాల వెనుకాల ఉన్న గిరిజన బాలికల వసతి గృహంలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న గిరిజన బాలికలతో మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే తాండూర్ పట్టణం సాయిపూర్ ప్రభుత్వ నంబర్ 1 పాఠశాల వెనకాల ఉన్నటువంటి గిరిజన బాలికల వసతి గృహంలో దాదాపు రెండు సంవత్సరాల నుండి హాస్టల్ పరిసరాలను శుభ్రం చేయిస్తూ, రెండు మూడో తరగతి చదువుతున్న చిన్నారి గిరిజన బాలికలతో మూడంతస్తుల వరకు ఉన్న భవనం పైకి బకెట్లతో నీళ్లను మోపిస్తూ,మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తూ ప్రాథమిక స్థాయి విద్యను అభ్యసిస్తున్న గిరిజన చిన్నారి పసి మొగ్గల జీవితాలతో వెట్టిచాకిరి చేయిస్తూన్నా పట్టించుకునే నాధుడు కరువయ్యారని విద్యార్థినిలు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన హాస్టల్ విద్యార్థినిలు మాట్లాడుతూ హాస్టల్లో మరుగుదొడ్లను శుభ్రం చేయించడమే కాకుండా, హాస్టల్ ఆవరణలో పెరుగుతున్న గడ్డిని సైతం తమతో తీయిస్తున్నారని, మంచినీటి ట్యాంకులను కూడా శుభ్రం చేయిస్తూ, అదేమిటి ఎందుకు అని అడుగుతే మమ్మల్ని కొడుతున్నారంటూ విద్యార్థులు కన్నీరు పెట్టుకుంటటూ తమ ఆవేదనవ్యక్తం చేశారు.అలాగే హాస్టల్లో నెలకొన్న సమస్యలపై మాట్లాడుతూ జ్వరం ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడితే కనీసం టాబ్లెట్లు కూడా ఇవ్వరని, ప్రతిరోజు కూడా మెనూ ప్రకారం భోజనం అందించకుండా నీళ్ల చారు, అన్నం మాత్రమే వడ్డిస్తున్నారని, విద్యుత్ అంతరాయంతో చదువుకునేందుకు కూడా ఆవస్థలు పడుతున్నామని తెలిపారు. అలాగే హాస్టల్లోఉంటూ కాలేజీ చదువుతున్న విద్యార్థినుల స్కాలర్షిప్ లను కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న పి డి ఎస్ యు వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు దీపక్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్తినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దీపక్ రెడ్డి మాట్లాడుతూ విద్యను అభ్యసిస్తున్న చిన్నారి విద్యార్థులనుచే మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తూ వెట్టిచాకిరి చేయిస్తున్న హాస్టల్ వార్డెన్, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనియెడల ఇదే హాస్టల్ విద్యార్థినిలచేపెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో పి డి ఎస్ యు నాయకులు సోయాబ్, శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.