గిరిజన బాలికల హాస్టల్లో కలుషిత ఆహారం తిని ఆస్పత్రి పాలైన విద్యార్థులు

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లోని గిరిజన బాలికల హాస్టల్ లో ఇటీవల 3 వారాల క్రితం జరిగిన విద్యార్థినిలపై ఎలుకల దాడి ఘటన మరువకముందే మరో సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం నాడు రాత్రి భోజనం తర్వాత సుమారు 40 మంది విద్యార్థినిలు వాంతులు విరోచనాలతో అస్వస్థకు గురయ్యారు. వారిని రాత్రికి రాత్రే ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించి తీవ్రత ఎక్కువగా ఉన్న 13 మంది విద్యార్థులను ఆస్పత్రిలో చేర్పిచి చికిత్స అందించారు. ఫుడ్ పాయిజన్ వల్లనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని డాక్టర్లు నిర్ధారించారు. మిగిలిన విద్యార్థులను తిరిగి హాస్టల్ కు తీసుకెళ్లారు. హాస్టల్లో సైతం హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి విద్యార్థులను అబ్జర్వేషన్ లో ఉంచారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికైనా హాస్టల్ విద్యార్థులకు మెరుగైన భోజనం, సదుపాయాలు అందించాలని కోరుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను శనివారం ఉదయం వివిధ పార్టీ నాయకులు పద్మారావు, పర్వయ్య, ఓంకార్, బబ్లు తదితరులు పరామర్శించారు.