గిరిజన రిజర్వేషన్లను పెంచాల్సిందే
ఆదిలాబాద్,జూన్22(జనం సాక్షి ): గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల కోసం ఇచ్చిన హావిూని నిలబెట్టు కోవాలని బంజార సేవాసంఘం జిల్లా కన్వీనర్ రమణాజాదవ్ అన్నారు. కొందరు అధికారులు గిరిజన తెగల మధ్య చిచ్చుపెట్టే యత్నం చేస్తూ లంబాడీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హావిూలను అమలు చేయకుండా గిరిజనులను మోసం చేస్తోందన్నారు.తాము సిఎం కెసిఆర్ హావిూ మేరకే పోరాడుతామని అన్నారు. గిరిజనులు అధికంగా ఉన్న ఆదిలాబాద్ నుంచే ఉద్యమిస్తామని అన్నారు. గిరిజనులకు ఇచ్చిన హావిూలను సిఎం కేసీఆర్ విస్మరించడం సరికాదని అన్నారు. 12శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోవడంతో ఇటీవల భర్తీచేసిన ఏఈ ఉద్యోగాల్లో గిరిజనులు ఎంతో నష్టపోయారన్నారు.తాండాలను పంచాయతీలుగా గుర్తించి పేద గిరిజనులకు మూడెకరాల భూపంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. దేశంలో 640 గిరిజన తెగలున్నాయని, అందరికీ సమాన హక్కులు కల్పించాలన్నారు. ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు కేవలం గిరిజనులకే కాదు ఏజెన్సీలో నివసిస్తున్న గిరిజనేతరులకు సైతం ఇవ్వాలన్నారు. ఈ ప్రభుత్వం గిరిజనులను అన్ని విధాలుగా మోసం చేస్తోందన్న విమర్శలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సిఎం కెసిఆర్‌దేనని అన్నారు.