గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

* టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్

టేకులపల్లి, ఆగస్టు 28 (జనం సాక్షి ): గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మూడు దశల పోరాటకార్యక్రమాలను జయప్రదం చేయాలని టిపిటిఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ ఉపాధ్యాయులను కోరారు. మొదటి దశలో ముఖ్యమంత్రికి పోస్టు కార్డు ఉద్యమంలో భాగంగా కోయగూడెం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్రాసిన పోస్టు కార్డులు ప్రదర్శిస్తూ సోమవారం నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని,ఉపాధ్యాయులకుకేటాయించబడుతున్న హాస్టల్ అదనపు విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని,రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడనందున సూపర్ న్యూమరరీ పోస్టులన్నింటినీ రెగ్యులర్ పోస్టులుగా మార్చి కన్వర్టెడ్ లేదా అప్ గ్రేడెడ్ ఆశ్రమ పాఠశాలలో సర్దుబాటు చేయాలని,రెగ్యులర్ పోస్టులలో అప్రెంటిస్ ఉపాధ్యాయులుగా నియమించబడిన వారిలో కొందరికి కోర్టు ఉత్తర్వుల ప్రకారం రెగ్యులర్ స్కేలు వర్తింపజేసినట్లుగానే కోర్టు ఉత్తర్వులను తెచ్చుకున్న మరికొందరికి కూడా రెగ్యులర్ స్కేలును వర్తింప జేయాలని, ఏకైకృత సర్వీసు నిబంధనలు రూపొందించి ఉపాధ్యాయులు ఉద్యోగుల సంఖ్య దామాషాన అనుసరించి ఉన్నత స్థాయి డిప్యూటీ డైరెక్టర్,డిటిడిఓ,ఏటిడిఓ,ఏవో పదోన్నతులు కల్పించాలని,జీవో 317 అమలు తర్వాత సూపర్ న్యూమరరి పోస్టులలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను రెగ్యులర్ ఖాళీలలో సర్దుబా