*గీతమా? వాదమా?*

తెలంగాణ నా రాష్ట్రం
దానికి ఓ గీతం ఉండాలి
చూడగానే గుర్తొచ్చే
ఓ చిహ్నం ఉండాలి!
మార్పు ఎప్పుడూ ఉంటుంది
నీవు అవునన్నా కాదన్నా
మార్పంటే ఉన్నది తీసివేయడం కాదు
లేనిది తీసుకరావడం!
గీతం, చిహ్నం..
గీతంలో చిహ్నం వినిపించాలి
చిహ్నంలో గీతం కనిపించాలి
దేని దారి దానిదే కాదు
అందరి సమ్మతి కావాలి
ఆ బాటలోనే నడవాలి!
రాష్ట్రీయ గీతం ఇది
రచయిత మన వాడే ఉండాలి
పాడేవారు మన వారే కావాలి
పరాయి రాష్ట్రం వారితో పాడిస్తే
మన గౌరవానికి తలవంపే!
మీ విశాల హృదయాలు
చూపాల్సింది ఇక్కడకాదు!
రాష్ట్రీయ గీతం అనేది
మన ప్రాంత గౌరవ సౌధం!
నీ కొత్త ఇంటి గడప
పెట్టాల్సింది
నీ ఇంటి ఆడపడుచు
అందంగా ఉన్నదని
సెలబ్రిటీ తో పెట్టిస్తావ?
మార్పు మంచిదే
మనం చేసే మార్పును
మార్చాలన్న ఆలోచన
ఎదుటివారికి రాకుండా ఉంటే!
జగ్గయ్య.జి
9849525802