గీత కార్మికుల పెన్షన్ వయసు తో సంబంధం లేకుండా 5000 రూపాయలు ఇవ్వాలి

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 22 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలో పీస్ గార్డెన్ తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం మండల మహాసభలో తెలంగాణ రాష్ట్రంలో కల్లు గీత కార్మికుల కు వయసుతో సంబంధం లేకుండా గీత కార్మికుల పెన్షన్ 5000 రూపాయలు ఇవ్వాలనీ తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి ప్రభుత్వాన్ని కోరారు ఆత్మకూర్ మండల మహాసభ బీసు చందర్ గౌడ్ గారి అధ్యక్షతన జరిగింది మహాసభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బూడిద గోపి మాట్లాడుతూ రాష్ట్రంలో గీతా కార్మికులు తమ ఉపాధి కోసం గత్యంతరం లేని పరిస్థితులలో తమ కుటుంబల పోషణ కోసం ప్రమాదం అని తెలిసిన తాటి చెట్ల ను ఎక్కడం జరుగుతుందని అట్టి సందర్భంలో ప్రమాదవశాత్తు తాటి చెట్ల పై నుండి జారీ పడి తీవ్ర గాయాల పాలవుతున్నారని తెలిపారు. వారికి ప్రభుత్వం ఇస్తామన్నా ఎక్స్గ్రేషియా ఎలాంటి షరతులు లేకుండా మెడికల్ బోర్డు నిబంధనలను తొలగించి నెలలోపు అట్టి కుటుంబాలకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేజీ కేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోలగాని జయరాములు మాట్లాడుతూ రాష్ట్రంలోని కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం. వారి హక్కుల సాధన కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తేవడానికి భవిష్యత్తు ఉద్యమాలకు రూపకల్పన చేయడం కోసం అక్టోబర్ 19 20 తేదీలలో యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలు జరుగుతున్నాయని అట్టి మహాసభల కు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 500 మంది ప్రతినిధులు హాజరవుతారని.ప్రారంభం రోజు వేలాది మందితో ప్రారంభ సభ నిర్వహించడం జరుగుతుందని అట్టి సభకు గీతా కార్మికుల పెద్ద ఎత్తున కదలి రావాల్సిందిగా కోరారు. తదనంతరం కే.జి.కే. ఎస్ నూతన మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది