గుజరాత్‌లో దారుణ ప్రమాదం

గుడిసెలోకి దూసుకెల్లిన ట్రక్కు
8మంది అక్కడిక్కడే మృత్యువాత
అహ్మదాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): గుడిసెలోకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఎనిమిదిమంది మృతి చెందిన ఘటన సోమవారం గుజరాత్‌లో చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఒక ట్రక్కు రోడ్డు పక్కన గుడిసెలోకి దూసుకు వెళ్లింది. ఆ సమయంలో గుడిసెలో నిద్రిస్తున్న 8 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు సావర్‌ కుండలా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతం భీతావహంగా మారింది. ప్రమాదానికి కారణమైన ట్రక్కు మహువా వైపు వెళుతోంది. బాద్దా గ్రామం సవిూపంలోకి రాగానే ట్రక్కు అదుపుతప్పి, ఒక గుడిసెలోకి దూసుకెళ్లి, తరువాత 8 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అమ్మేలీ జిల్లాలోని బధాడా గ్రామంలో క్రేన్‌ను తరలిస్తుండగా ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లిందని తెలిపారు. గుడిసెలో పదిమంది నిద్రిస్తుండగా… వారిపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ఎనిమిదిమంది మృతి చెందారని, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయని చెప్పారు. క్షతగాత్రులను వెంటనే ఆసుప్రతికి తరలించామన్నారు. మరణించినవారిలో ఇద్దరు వృద్ధులతో పాటు 8`13 సంవత్సరాల మధ్య వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త తెలుసుకున్న గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాణీ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.