గుజరాత్‌ సీఎంగా రూపానీ ప్రమాణం

1

గాంధీనగర్‌,ఆగస్టు 7(జనంసాక్షి):గుజరాత్‌ నూతన ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపానీ ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 12.40గంటలకు 60 ఏళ్ల రూపానీతో గవర్నర్‌ ఓపీ కోహ్లీ ప్రమాణం చేయించారు. గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రిగా నితిన్‌ పటేల్‌ ప్రమాణస్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, సీనియర్‌ నేత ఎల్‌.కె.అడ్వాణీ, పలువురు పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు.