గుడుంబా తయారీ దారులపై పోలీస్ ఎక్సైజ్ శాఖ ఉక్కు పాదం….
బెల్లం, పట్టిక, సారాయి పట్టివేత ఇరువురు అరెస్ట్, ఆటో సీజ్….
ఇల్లందు జూన్ 30(జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బుధవారం ఉదయం మండల పరిధిలోని ధర్మారం తండాలో కాపుసార కాస్తున్నారని, అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు పోలీస్ ఇన్స్పెక్టర్ భానోత్ రాజు,SI రాజేష్ సిబ్బంది తో పాటు ఎక్సైజ్ సీఐ రాజశేఖర్, ఎక్సైజ్ ఎస్సై రమాదేవి సిబ్బందితో కలిసి ధర్మారం తండాలో నోకియా బాల ఇంట్లో సోదాలు చేయగా అక్కడ నాలుగు లీటర్ల కాపుసారా దొరికింది. సారా తయారీ కి ఉపయోగించే పట్టిక, బెల్లం సరఫరా చేసి వివరాలపై బాలాను విచారించగా బెల్లం , పట్టిక సరఫరా చేసే వ్యాపారి వివరాలు పోలీసులకు తెలిపారు. వెంటనే ఇన్స్పెక్టర్ బి.రాజు సుదిమల స్టేజి వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా హనుమంతులపాడుకు చెందిన సంగం అశోక్ TS 28 T 7091 గల తన ఆటోలో సారా తయారు చేసే250 కేజీల బెల్లం, ఐదు కేజీల పట్టికను పట్టుకున్నారు.
వెంటనే రాజు సంఘం అశోకుని, భూక్య బలా పై కేసు నమోదు చేసి ఆటో సీజ్ చేశారు. అనంతరం ఎక్సైజ్ ఎస్ఐ రమాదేవికి అప్పజెప్పారు.