*గుడుంబా పట్టివేత*
*ఆరులీటర్ల గుడుంబా స్వాధీనం*
*పలిమెల, అక్టోబర్ 21 (జనంసాక్షి)*
మండలంలోని సర్వాయిపేట గ్రామంలో ప్రభుత్వ నిషేదిత గుడుంబాను పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్సై అరుణ్ తెలిపారు. సర్వాయిపేట గ్రామానికి చెందిన బౌతు సమ్మక్క అనే మహిళకు చెందిన కిరాణా షాపులో అమ్మటకు సిద్దంగా ఉంచిన ఆరు లీటర్ల గుడుంబాను పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుబడిన ఆరు లీటర్ల గుడుంబాను సీజ్ చేసి సదరు మహిళపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అరుణ్ తెలిపారు. గ్రామంలో నిషేధిత గుడుంబాను తయారు చేసినా, అమ్మినా, తాగినా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అరుణ్ తో పాటు సివిల్ మరియు సీఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area