గురువింద నీతులు మానండి

4

– అమరుల కుటుంబాలపై పోటీచేసిన మీరా సాంప్రదాయాలు వళ్లించేది

– కాంగ్రెస్‌, టీడీపీలకు కేటీఆర్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్‌,మే6(జనంసాక్షి): పాలేరు ఎన్నిక విషయంలో కాంగ్రెస్‌ సానుభూతి నాటకం గురువిందను తలపిస్తుందని మంత్రి కెటి రామారావు ఘాటుగా విమర్శించారు. గతంలో ఎన్నడూ దీనిపై స్పందించని కాంగ్రెస్‌ ఇప్పుడు పాలేరు వచ్చే సరికి సానుభూతి వచనాలు వల్లిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు

కాంగ్రెస్‌, టీడీపీలకు మంత్రి కేటీఆర్‌ బహిరంగలేఖ రాశారు. ప్రతి ఎన్నికల్లో పరాజయం కాంగ్రెస్‌, టీడీపీలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. రాంరెడ్డి వెంకటరెడ్డి బతికున్నప్పుడు రూ.కోటి కేటాయించి విదేశాల నుంచి మందులు తెప్పించిన మానవత్వం మా ప్రభుత్వానిదని,  మరణాన్ని రాజకీయాలకు వాడుకుంటున్న అరాచకం కాంగ్రెస్‌ పార్టీదని కెటిఆర్‌ మండిపడ్డారు. గత ఎన్నికల్లో శ్రీకాంతాచారి తల్లిపై పోటీకి హుజూర్‌నగర్‌లో లేని సానుభూతి, సాంప్రదాయం పాలేరులో ఉండదన్న నిజాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలుసుకుంటే మంచిదని కేటీఆర్‌ హితవు పలికారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను పాతరేసినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్‌కు తెలుగుదేశం పార్టీ తోక పార్టీగా మారిందని, ఎన్టీఆర్‌ బతికున్నప్పుడు వెన్నుపోటు, ఇప్పుడు ఆత్మకు వెన్నుపోటు ఇదే టీడీపీ అసలు నైజమని మండిపడ్డారు.  ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న టీడీపీ నైజం, భక్తరామదాసు, సీతారామా ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న టీడీపీ మద్దతు తీసుకున్న కాంగ్రెస్‌ పాలేరు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పాలేరులో కాంగ్రెస్‌, టీడీపీ పార్టీల వెర్రి వేషాలకు పాతర తప్పదని హెచ్చరించారు. సానుభూతి పేరుతో కాంగ్రెస్‌ చేస్తున్నది రాజకీయం కాదు… అరాచకమన్నారు.  తెలంగాణ సాయుధపోరాట యోధుడైన అప్పటి సుజాతనగర్‌ సీపీఐ ఎమ్మెల్యే మహ్మద్‌ రజబ్‌ అలీ 1996లో మరణిస్తే ఇదే రాంరెడ్డి పోటీ చేసినప్పుడు మానవత్వం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. 2000లో మంత్రి ఎలిమనేటి మాధవరెడ్డి మరణించినప్పుడు ఆయన భార్య ఉమామాధవరెడ్డిపై పోటీకి దిగినప్పుడు కాంగ్రెస్‌ సానుభూతి ఏమైందని అడిగారు. తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మపై పోటీ చేసినప్పుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మానవత్వం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.ఏదో విధంగా గట్టెక్కాలన్న దురాలోచనతో .సానుభూతి నాటకాన్ని కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ ఆరంభించిందని ఆయన అన్నారు. దీనికి సంబందించి ఆయన లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పడినతరవాత  జరుగుతున్న ప్రతి ఉపఎన్నికలోనూ పరాజయం పొందడం అలవాటుగా చేసుకున్న పార్టీ కాంగ్రెస్‌. పాలేరులో టీఆర్‌ఎస్‌ కు వస్తున్న ప్రజాదరణకు భయపడి సానూభూతి నాటకాన్ని షురూ చేసింది.చెప్పేందుకే నీతులంటూ చరిత్రను మరిచినట్టు డ్రామాలాడుతున్న కాంగ్రెస్‌ పార్టీకీ, తెలంగాణను ఎట్లైనా బర్‌ బాద్‌ చేయడాన్నే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న అంధ్రప్రదేశ్‌ ఏజెండాను నిస్సిగ్గుగా మోస్తున్న తెలుగుదేశం పార్టీలకి ఈ బహిరంగ లేఖ అన్నారు. ఎఎన్నికల్లో గెలవడాన్ని ఎన్నడో మరిచిపోయి, టీఆర్‌ఎస్‌ ను ఎదుర్కునే దమ్ములేక పోటీకి ముందే అస్త్ర సన్యాసం చేసిన కాంగ్రెస్‌ పార్టీ మానవత్వం, సానూభూతి పేరుతో సరికొత్త నాటకానికి తెర తీసిందన్నారు.  సొంతపార్టీ చరిత్ర తెలియనినేతల నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్‌ ను చూస్తుంటే ఆశ్చర్యంతో పాటు సిగ్గు వేస్తోందని అన్నారు. నిన్నటి నిజాలను దాచి చైతన్యవంతులైన ఖమ్మం ప్రజానీకాన్ని మాయచేస్తామనుకుంటున్న కాంగ్రెస్‌ కుటిల నీతులను ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. ఇన్నాళ్ళు అధికారంలో ఉండి పక్క రాష్ట్రంలోని ప్రాంతాల నేతల  అడుగులకి మడుగులోత్తిన కాంగ్రెస్‌ నేతలను, దశాబ్దాలుగా పాలనలో ఉండి పనులు

చేయకుండా తెలంగాణని వెనకేసిన కాంగ్రెస్‌ ని తెలంగాణలో పాతరేసినప్పుడే ప్రజలకు మేలని అన్నారు. ఎన్నికల్లో కనీసం పోటీ చేసే ధైర్యంలేక దశాబ్దాలుగా అలవాటైన అవకాశావాదాన్ని మరోసారి ఉపయోగించుకుంటూ తెలుగుదేశం ఘోరమైన తప్పటడుగు వేసింది. రెండు నెలల కింద నారాయణ్‌ ఖేడ్‌ లో జరిగిన న్నికల్లోనూ దివంగత యంఏల్యే కుటుంబ సభ్యులు పోటీ చేసినప్పుడు బరిలో నిలిచినతెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొత్త సంప్రదాయం గుర్తుకు రావడం చూస్తూంటే, కాంగ్రెస్‌ పార్టీకి అచ్చం తోకపార్టీలా తెలుగుదేశం మారిపొయిందనక తప్పదన్నారు. ఇప్పటికే బాబు నీచరాజకీయాలు చూసి మెజార్టీ ఎమ్మల్యేలంతా టియారెస్‌ లో చేరగా మిలిన ఇద్దరు ముగ్గురు నేతల తోకపార్టీ తెలుగుదేశం ఎన్నటికైనా కాంగ్రెస్లో కలవాల్సిందే అనిపిస్తుంది.  కాంగ్రెస్‌ జెండాలతో, సోనియా బోమ్మతో తన బోమ్మ చూసుకుని యన్టీయార్‌ ఆత్మ క్షోభకి గురవుతున్నదని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ ఆందప్రదేశ్‌ చేస్తున్న అన్యాయమైన అడ్డగోలు వాదనలకు మద్దతు పలుకుతున్న తెలుగుదేశం నేతలు ముమ్మాటికి తెలంగాణ ద్రోహులేనని అన్నారు. అరవై ఏళ్ల దోచుకోబడిన తెలంగాణ నీటి వాటను ఇప్పుడు ప్రజలకి అందించేప్రయత్నాన్ని అడుగడునా అడ్డుకుంటున్న వారితో అంటకాగుతూ తెలంగాణ ప్రజలకి

తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణని లక్షల ఏకరాలను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి చేపట్టిన ప్రాజెక్టులను గంపగుత్తగా వ్యతిరేకిస్తూ కాబినెట్‌ తీర్మాణం చేసిన అందప్రదేశ్‌లోని  టిడిపి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న తెలంగాణ తెలుగుదేశం నేతల తీరుని తల్లిపాలు తాగి రోమ్ము గుద్దిన వైనాన్ని గుర్తకు తెస్తున్నదని కెటిఆర్‌ మండిపడ్డారు.  రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న పచ్చ పార్టీ తెలంగాణ వ్యతిరేక ఎజెండాను సొంత రాష్టంలోనూ అమలు చేస్తున్న తెలంగాణ తెలుగుదేశం నేతలు ఖచ్చితంగా తెలంగాణ ద్రోహులే అన్నారు. జీవనదులు పారుతున్నా పంటలకి నోచుకోని ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన భక్త రామదాసు, సీతా రామా ప్రాజెక్టుల ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న టిడిపి పార్టీ మద్దతు తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకి ప్రాజెక్టులపైన వివరణ ఇవ్వాలన్నారు. . పాలేరు నియోజకవర్గంలో వెనక బడిన తిరుమలయాపాలెం భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా పచ్చపడుతుంటే సహించలేని టిడిపి మద్దతు పోటీచేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ముందుగా పాలేరు ప్రజానీకానికి విభేదాలు మరిచి అవకాశవాదంతో అంటకాగుతున్న టిడిపి ప్రజలు పాలేరులో పాతరేస్తారన్న నమ్మకం ఉంది. రెండు పార్టీల కలిసినా టియారెస్‌ ని ఏదుర్కోలేనక , అడలేక ఒడల మిద్దే అన్నట్లు వేస్తున్న వెర్రి వేషాలను పాలేరు ప్రజలు పాతరేస్తారని కెటిఆర్‌ తన లేఖలో హెచ్చరించారు.