గురువులే సమాజ నిర్దేశకులు :
విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించిన మంత్రి
నల్లగొండ. జనం సాక్షి :
ఉపాధ్యాయులే సమాజ నిర్దేశకులని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం గురుపూజోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ లో నల్లగొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. దామరచర్ల మండలం వీర్లపాలెం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు నసీ మున్నిసా బేగంను శాలువా కప్పి మెమొంటు, ప్రశంస పత్రం అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఏ స్థాయిలో ఉన్న తల్లి తండ్రి తర్వాత గురువులే సమాజాన్ని నిర్దేశించగలరని, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని తన యొక్క విద్యార్థి అభివృద్ధి చెందాలని నిరంతరం కోరుకునే వారే ఉపాధ్యాయులని అలాంటి ఉపాధ్యాయులను సన్మానించడం సమాజానికి గర్వకారణం అని అన్నారు.
అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని వారి యొక్క సేవకు విలువ కట్టలేమని అన్నారు.జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్ర కుమార్ గాదరి కిషోర్ లు మాట్లాడుతూ ఉపాధ్యాయులు తాము అంకితభావంతో పని చేస్తే గుర్తింపు లభిస్తుందని అన్నారు.
పి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో…. ఉపాధ్యాయులకు సన్మానం :
నల్లగొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన దామరచర్ల మండల ఉపాధ్యాయులు నసీమున్నీ సాబేగం, పానుగోతు కృష్ణ, కంభం సైదిరెడ్డిలకు పి ఆర్ టి యు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ నాయక్ రాష్ట్ర బాధ్యులు కురువ నాయక్, సైదిరెడ్డి జిల్లా బాధ్యులు గుడిపాటి కోటయ్య దామరచర్ల మండలం అధ్యక్ష కార్యదర్శులు మందుల అశోక్ కుమార్, అనుముల సైదిరెడ్డి, కే శ్రీనివాస్, పాక ప్రసాద్, రాఘవరెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు సంఘ అధ్యక్ష కార్యదర్శులు సుంకర భిక్షం గౌడ్, నారాయణరెడ్డి ఎంఈఓ లు మాలోతు బాలాజీ నాయక్, బాలు ,రాము, నరసింహ, రాష్ట్ర బాధ్యులు నల్ల మేకల వెంకయ్య, జిల్లా బాధ్యులు గుడిపాటి కోటయ్య వివిధ మండల శాఖల అధ్యక్ష కార్యదర్శులు అశోక్, రామచంద్రు, నిరంజన్ రెడ్డి, సైదిరెడ్డి, సునీల్,సైదులు, తదితరులు పాల్గొన్నారు