గులాబీ గూటికి మరో గాయకుడు సోమన్న
హైదరాబాద్ : వైఎస్ షర్మిల వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీకి మరో ఝలక్. ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఆయన గులాబీ కండువా కప్పుకోవడం ఖరారయ్యింది. ఈ మేరకు చేరికకు ముందు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును మర్యాదపూర్వకంగా కలిశారు. సోమన్నను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేటీఆర్.. సదరు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కూడా పాల్గొన్నారు. షర్మిల వైఎస్సార్టీపీని స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీలో సోమన్న కీలక నేతగా ఉన్న విషయం తెలిసిందే.