గూగుల్‌ పే ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు


అందుబాటులోకి తెచ్చే యత్నాలు
న్యూఢల్లీి,ఆగస్ట్‌26(జనంసాక్షి): త్వరలో ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లను బుకింగ్‌ చేసుకునే వీలును గూగుల్‌ పే కల్పించనున్నది. భాగస్వామి ఫిన్‌టెక్‌ ద్వారా ఈ సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నది. మింట్‌ నివేదిక ప్రకారం, గూగుల్‌ పే ద్వారా ఎఫ్‌డీలను బుక్‌ చేసుకునేందుకు తమ వినియోగదారులను అనుమతించడానికి అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌లను (ఏపీఐ) అందించడంలో ప్రత్యేకత కలిగిన ఫిన్‌టెక్‌ సేతుతో గూగుల్‌ జతకట్టింది. దీంతో గూగుల్‌ పే వినియోగదారులు ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఎఫ్‌డీలను ఒక ఏడాది వరకు బుక్‌ చేసుకోవచ్చు. ఈ ఎఫ్‌డీలకు పొందే గరిష్ట వడ్డీ రేటు 6.35 శాతంగా ఉండనున్నది. అయితే, ఈ సదుపాయాన్ని పొందాలనుకునే వారు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) ద్వారా ఆధార్‌ ఆధారిత కేవైసీని పూర్తిచేయాల్సి ఉంటుంది. ఏపీఐ బీటా వెర్షన్‌ 7`29 రోజులు, 30`45 రోజులు, 46`90 రోజులు, 91`180 రోజులు, 181`364 రోజులు, 365 రోజులు సహా వివిధ కాలపరిమితుల ఎఫ్‌డీలను అందిస్తున్నది. వడ్డీ రేట్లు 3.5 శాతం నుంచి ఏడాది కాలం ఎఫ్‌డీకి అతి తక్కువగా 6.35 శాతం వడ్డీ రేటును ఇవ్వనున్నది. గూగుల్‌ పే భారతదేశంలో 1.50 కోట్ల నెలవారీ ఆక్టీవ్‌ యూజర్స్‌ కలిగి ఉన్నది. అధిక వడ్డీ పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లను అందించడానికి చిన్న ఫైనాన్స్‌
బ్యాంకులు ఫిన్‌టెక్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఇటీవల, ఈక్విటాస్‌ స్మాల్‌ ్గªనాన్స్‌ బ్యాంక్‌, నియో, ఫ్రియో వంటి ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యమై సేవింగ్స్‌ ఖాతాల్లో రూ.1 లక్ష కంటే ఎక్కువ బ్యాలెన్స్‌లకు 7 శాతం వడ్డీ రేట్లు అందిస్తున్నది.