గూడాలు-తండాలను గ్రామపంచాయతీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే

 

 

 

 

 

;- శాసనసభ్యుడు డిఎస్ రెడ్యానాయక్

;– గల్లి గల్లి కు ఎమ్మెల్యే రెడ్యా పర్యటన

డోర్నకల్, ఆగస్టు-13, జనం సాక్షి న్యూస్: గూడాలు, పల్లేలు, తండాలను గ్రామపంచాయతీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అని డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు. ఆదివారం డోర్నకల్ మండలంలోని పెరుమాళ్ళ సంకిస, తెల్ల బండతండా, చిలుకోడు గ్రామాలలో ప్రతి వాడవాడకు గల్లి గల్లి కు తిరిగి ప్రజల బాగోగులను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా మూడు గ్రామాలలో పలు అభివృద్ధి శంకుస్థాపన, ప్రారంభోత్సవ పనులను ప్రారంభించిన శాసనసభ్యుడు రెడ్యానాయక్.పెరుమాళ్ళ సంకిస సర్పంచ్ బొబ్బ వెంకట్ లక్ష్మి ఎమ్మెల్యే రెడ్యానాయ కు గ్రామాల్లో మరికొన్ని సిసి రోడ్లు, సీతారామచంద్ర స్వామి వారి దేవాలయ పునర్నిర్మాణం కొరకు, రైతులకు సాగు కొరకు కాలువల ద్వారా నీరు అందించాలని పలు అభివృద్ధి కార్యక్రమాల కొరకు మరిన్ని నిధులు సుమారు 40 లక్షలు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు.
ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మాట్లాడుతూ పెరుమళ్ళ సంకిస, తోడేళ్లగూడెం గ్రామాలలో దేవాలయాలకు త్వరలో సుమారు 50 లక్షల నిధులు కేటాయిస్తామని, ప్రతి గ్రామానికి అభివృద్ధి కొరకు కొన్ని నిధులు కేటాయిస్తామని ఆయన అన్నారు. ఈనెల చివరికల్లా నియోజవర్గంలో ఏఏ మందికి బీసీ బందు ఇస్తామని, దళితులకు దళిత బంధు 10 లక్షలు కూడా ఇస్తామని, మైనార్టీలకు లక్ష సహాయం చేస్తామని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. ప్రతి గ్రామానికి గృహ లక్ష్మీ పథకం కింద డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని, సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల ముందు రైతు రుణమాఫీ గురించి ఇచ్చిన రుణమాఫీ హామీ ఈనెల మూడో తారీకు నుండి సెప్టెంబర్ ఐదో తారీకు వరకు నేరుగా రైతుల ఖాతాలో రుణమాఫీచేయడం జరుగుతుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 జిల్లాల నుండి 33 జిల్లాలుగా ఏర్పడిందని, అదేవిధంగా కొన్నిచోట్ల మండలాలు గ్రామాలు కొత్తగా ఏర్పాటు చేయడం ద్వారా ఆ గ్రామ ప్రజలకు ప్రజా పరిపాలన అందరికీ అందుబాటులో ఉంటుందని సరైన సమయానికి పనులు సులభంగా త్వరగా అవడం జరుగుతుందని శాసనసభ్యుడు రెడ్యా నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నున్న రమణ, మార్కెట్ చైర్మన్ విద్యాసాగర్, ఎంపీపీ బాలు నాయక్, జడ్పిటిసి కమలా, రామనాథం, మున్సిపాలిటీ చైర్మన్ వాంకుడోతి వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం ,మాజీ జెడ్పిటిసి సత్తిరెడ్డి, సొసైటీ చైర్మన్ బిక్షం రెడ్డి, వైస్ ఎంపీపీ తుమ్మ వెంకటరెడ్డి,ముఖ్య నాయకులు పొడిశెట్టి రామనాదం,మండల యూత్ అధ్యక్షుడు అంగోత్ హరీష్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుద్దేటి మల్లయ్య, రాయల వెంకటేశ్వర్లు, వివిధ గ్రామాల సర్పంచులు బొబ్బ వెంకట్ లక్ష్మి, గూగులోత్ శ్రీను నాయక్, రాయల వెంకట బాబు,రాంప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షులు కడెం బాబు, హనుమ,వీరన్న, గ్రామ కో ఆర్డినేటర్ నంజ్యాల మధుసూదన్ రావు, ఎంపీడీవో ఆపర్ణ, తాసిల్దార్ నాగ భవాని, ఏపీఎం శంకర్, మిషన్ భగీరథ ఏఈ సుమన్, విద్యుత్ శాఖ ఏఈ, వివిధ గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.