గెలిచిన జట్టుకు టాప్ ప్లేస్ సఫారీ సవాల్‌కు ఆసీస్ చెక్ పెట్టేనా
రేపటి నుండి ఆసీస్-సౌత్ ఆఫ్రికా చివరి టెస్ట్
పెర్త్ ,నవంబర్ 29 : ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ జట్లుగా భావించిన ఆస్టేల్రియా , దక్షిణాఫ్రికా మరో కీలకపోరుకు సిధ్ధమయ్యాయి. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. సొంతగడ్డపై సఫారీలకు చెక్ పెట్టలేకపోతున్న కంగారూలు చివరి మ్యాచ్‌లో గెలివాలని పట్టుదలగా ఉన్నారు. దీనికి ప్రత్యేక కారణాలు లేకపోలేదు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ మ్యాచ్‌తో కెరీర్ ముగించనున్నాడు. దీంతో పెర్త్‌లో గెలిచి సిరీస్ విజయంతో పంటర్‌కు గ్రాండ్‌గా వీడ్కోలు పలకాలని ఆసీస్ క్రికెటర్లు భావిస్తున్నారు. అటు కెప్టెన్ మైకేల్ క్లార్క్ దీని కోసం వ్యూహరచనలో నిమగ్నమయ్యాడు. గత రెండు మ్యాచ్‌లలో చేసిన తప్పులను రిపీట్ కాకుండా చూసుకోవాలని భావిస్తున్నాడు. మొదటి టెస్ట్‌తో పాటు అడిలైడ్ టెస్టులో ఆసీస్ పూర్తి ఆధిపత్యం కనబరిచినా…గెలుపు ముంగిట బోల్తా పడింది. సౌతాఫ్రికా చక్కని పోరాటపటిమతో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. దీంతో పెర్త్ టెస్టులో ఎలాగైనా నెగ్గాలని క్లార్క్ పట్టుదలగా ఉన్నాడు. రేపటి మ్యాచ్‌లో షేన్ వాట్సన్ ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన వాట్సన్ ఇప్పుడు ఫిట్‌గా ఉండడం కలిసొచ్చే అంశం. అలాగే ఏడాది తర్వాత జట్టులోకి వచ్చిన మిఛెల్ జాన్సన్ కూడా అంచనాల మధ్య బరిలోకి దిగుతున్నాడు. అయితే హిల్ఫెనాస్ , పీటర్ సిడెల్ మాత్రం ఈ మ్యాచ్‌కు దూరం కానున్నారు. మరోవైపు నిలకడలేమి బ్యాటింగ్‌తో ఇబ్బంది పడుతోన్న సఫారీలు చివరి మ్యాచ్‌తో గాడిన పడాలని భావిస్తున్నారు. గత మ్యాచ్‌లో డుప్లెసిస్ సెంచరీతో ఓటమి తప్పించుకున్న ఆ జట్టు పెర్త్‌లో గెలిచి సిరీస్ దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. దీని కోసం గత మూడు రోజులుగా నెట్స్‌కే పరిమితమైన సఫారీ క్రికెటర్లు పూర్తి స్థాయిలో సత్తా చాటేందుకు సిధ్దమవుతున్నారు. బ్యాటింగ్‌లో స్మిత్ , కల్లిస్ , ఆమ్లా , డివిలీయర్స్‌తో పాటు డుప్లెసిస్‌పై అంచనాలున్నాయి. బౌలింగ్‌లో డేల్ స్టెయిన్ , క్లిన్‌వెల్ట్ , ఫిలాండర్ కీలకం కానున్నారు. బ్యాటింగ్ గాడిన పడడంతో పాటు తొలి రెండు టెస్టుల్లో చూపిన పోరాటాన్ని రిపీట్ చేస్తే ఆసీస్ గడ్డపై సిరీస్ విజయం సౌతాఫ్రికాకు పెద్ద కష్టం కాబోదు. ఈ నేపథ్యంలో రేపటి నుండి ప్రారంభం కానున్న మ్యాచ్ ¬రా¬రీగా సాగడం ఖాయమని అంచనా వేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో గెలిస్తే… రెండేళ్ళ తర్వాత ఆస్టేల్రియా మళ్ళీ నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకుంటుంది.
ఆస్టేల్రియా తుది జట్టు (అంచనా) ః
ఎడ్‌కొవాన్ , డేవిడ్ వార్నర్ , షేన్ వాట్సన్ , రికీ పాంటింగ్ , మైకేల్ క్లార్క్ (కెప్టెన్) , మైకేల్ హస్సీ , మాథ్యూ వేడ్ , మిఛెల్ జాన్సన్ , నాథన్ ల్యాన్ , మిఛెల్ స్టార్క్ , హ్యాజిల్‌వుడ్
దక్షిణాఫ్రికా తుది జట్టు (అంచనా) ః
గ్రేమ్ స్మిత్ (కెప్టెన్) , పీటర్సన్ , హషీమ్ ఆమ్లా , జాక్ కల్లిస్ , డివీలియర్స్ , డుప్లెసిస్ , రాబిన్ పీటర్సన్ , ఫిలాండర్ , డేల్ స్టెయిన్ , క్లిన్‌వెల్ట్ , మోర్నే మోర్కెల్