గెలిపించే బాధ్యత మీది అభివృద్ధి బాధ్యత నాది

గెలిపించే బాధ్యత మీది అభివృద్ధి బాధ్యత నాది

వనపర్తి బ్యూరో నవంబర్06 (జనంసాక్షి)

వనపర్తి ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించే బాధ్యత మీది వనపర్తిని మరింత వేగంగా అభివృద్ది చేసే బాధ్యత నాది. నాకు తెలిసిందల్లా ఒక్కటే ఉన్న సమయంలో ఎంత వేగంగా పని చేస్తే అంత వేగంగా అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. 100 ఏండ్ల వనపర్తి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు సాగుతున్నామని, చేసే పనిని ప్రజల ముందు పెడుతానని హామి ఇచ్చానంటే ఎన్ని కష్టాలు , ఇబ్బందులు వచ్చిన వెనక్కి అడుగు వేయనని ప్రభుత్వం, ప్రజలను ఒప్పించి పూర్తి చేసే వరకు నిద్ర పోనని అందుకు నిదర్శనం వనపర్తి రోడ్ల విస్తరణ అని అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 25వ , 26వ వార్డులో స్థానిక నాయకులతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ను నిర్వహించారు. మంత్రి నిరంజన్ రెడ్డికి ఆయా వార్డులలో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్యలో ఉండడం నాకు అలవాటు అని ప్రజల కష్టాలను కండ్లరా చూసిన వ్యక్తి ని నేను అందుకే సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి పాలమూరు నుండి గులాబీ జెండాను ఎత్తుకుని ప్రతి గ్రామాన్ని తిరిగి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయని మంత్రి గుర్తు చేసుకున్నారు . తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుని ముందుకు తీసుకుని పోతున్నామన్నారు. మురికి కూపాలకు అడ్డాగా మారినా చెరువులను మినీ ట్యాంక్ బండ్ లుగా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చామని ఈ రోజు ప్రజలందరు ఉదయం సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తూ మంచి వాతావరణంను స్వీకరిస్తున్నారన్నారు . దేశంలో తెలంగాణ అభివృద్ధిలో ముందున్నదని, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మనం ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనందరం పరిష్కరించుకున్నామన్నారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి హైదరాబాద్ ఇతర మహనగరాలకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయని, నిరుపేద విద్యార్థులకు అందని ద్రాక్షల ఉన్న మెడికల్, ఇంజనీరింగ్, నర్సింగ్ కళాశాలలను అందుబాటులోకి తీసుకుని వచ్చామన్నారు. సాగునీటి ని తీసుకుని రావడంతో వ్యవసాయ రంగం అభివృద్ధి చెంది, వలసలు తగ్గిపోవడంతో పాటు వాటి అనుబంధ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి వివరించారు. నాడు వలసలకు నిలయంగా ఉన్న వనపర్తి నేడు వరి పంటల వనపర్తి గా మారిందని ఈ విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ వనపర్తి లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో చెప్పడం జరిగిందని, ఈనాడు ఏ గ్రామం వెళ్లిన పచ్చని పంట పొలాలతో భూములన్నీ కనిపిస్తున్నాయని ఇతర రాష్ట్రాల నుండి కూలీలు వస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్నదే ప్రజలు ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారని వనపర్తి లో గత ఎన్నికలకు మించి భారీ మెజారిటీతో బీఆర్ఎస్ గెలుస్తుందని , రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని మంత్రి ధీమాను వ్యక్తం చేశారు. మంత్రి వెంట జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ , జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, గ్రంథాలయ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్, రీజనల్ అథారిటీ సభ్యులు ఆవుల రమేష్ , మీడియా సెల్ కన్వీనర్లు నందిమల్ల శ్యామ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు