గొల్లకురుమలు ఆర్థికంగా ఎదగాలి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌30(జ‌నం సాక్షి): గొల్లకురుమలకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేస్తూ వారి కుటుంబాలు ఆర్థికాభివృద్ది సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. వీటి ద్వారా యాదవులు వచ్చే రెండేళ్లలో ఆర్థికప్రగతి సాధించాలన్నారు.ఈ పథకంద్వారా గొల్లకురుమల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ ఊతం ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణలో కూలిపోతున్న కులవృత్తులకు పునర్జన్మనిచ్చిన మహనీయుడు కెసిఆర్‌ అని అన్నారు. నియోజకవర్గంలో ఆయన లబ్ధిదారులకు మంజూరైన గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు. మిషన్‌ కాకతీయతో మొదలయిన అభివృద్ది కార్యక్రమాలు తాజాగా యాదవులకు గొర్రెల పంపిణీ వరకు కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. బెస్తలకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేసిన సర్కార్‌, తాజాగాగొర్రెలను అందజేయడమే కాకుండా వాటికి గ్రాసాన్ని కూడా అందజేయనుందని అన్నారు. డీవార్మింగ్‌ తదితర రోగాల భారీ నుంచి రక్షించుకోవడం కోసం పశుసంవర్ధకశాఖ ద్వారా మందులను అందజేస్తున్నట్లు తెలిపారు. యాదవులు వచ్చే రెండేళ్లలో ఆర్థిక ప్రగతి సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.