గోదారి ప్రక్కన ఊరు సురక్షిత ప్రాంతం కావాలని పోరు …

ఫారెస్ట్ భూమి అంటు .గుడిసెలు తొలగింపు …
గ్రామస్తులతో అటవీ అధికారుల వాగ్వివాదం…
మహాదేవపూర్. జులై    (జనంసాక్షి)
మహాదేవపూర్ మండల కేంద్రంలో గత వారం నుండి భారీగా కురుస్తున్న.అకాల వర్షాలకు వరదల వల్ల తమ గ్రామం  మునిగి పోతున్నాయని  మండలంలోని కుదురుపల్లి గ్రామ ప్రజలు గురువారం నాడు ఎత్తైన ప్రదేశంలో తమ ప్రాణాలు కాపాడుకుందామని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అసలు సమస్య అక్కడే మొదలైనది. గ్రామస్తులు వేసుకున్న గుడిసెలు   రెవెన్యూ  భూమి  అంటూ, వాదించగా  అటవీశాఖ అధికారులు మాత్రం రిజర్వుడ్ అటవీ భూమి అంటూ ఘర్షణ చోటుచేసుకుంది. సుమారు 200మంది గ్రామస్తులు తాము వేసుకున్న గుడిసెలో ఉంటామని అధికారులు బలవంతంగా వెల్లగొట్టితే తాము మూకుమ్మడిగా గోదావరిలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో స్థానిక ఎస్ ఐ రాజుకుమార్ .ఏ ఎస్ ఐ. చేరాలు చేరుకుని ఇరు వర్గాలను సమదాయించే ప్రయత్నం చేయగా గ్రామస్తులు ససేమిరా అంటూ గుడిసెలు తొలగించేది లేదని పట్టుబట్టారు.50 ఏండ్లుగా కుదురుపల్లి గ్రామానికి గోదావరీ నదీ వల్ల తాము నష్టాలు పడుతూనే ఉన్నామని ఆవేదన వ్యక్తంచేశారు. అటవీశాఖ అధికారులు గ్రామస్తుల సెల్ ఫోన్ లు బలవంతంగా లాక్కున్నారని బాధితులు వాపోయారు. ఏదేమైనప్పటికిని ఇక్కడి నుండి కదిలే ప్రశక్తి లేదని  యే అధికారి మా గోస వినడం లేదని గ్రామస్థులు పేర్కొన్నారు