గోవుల సేవలో ఆది వేణుగోపాలు. – దౌల్తాబాద్ లో గోశాల ఏర్పాటు. – గోవులంటే ఆయనకు ఎనలేని ప్రేమ. – రెండు గోవులతో ప్రారంభమై నేడు 20 ఆవులు. – అటు గోవులకు, ఇటు ప్రజలకు సేవ చేస్తూ ఆదర్శంగా నిలిచిన ప్రజా ప్రతినిధి ఆది వేణుగోపాల్.

 

దౌల్తాబాద్ జూలై 19, జనం సాక్షి.గోవుల రక్షణ ప్రజా ప్రతినిధి ఎనలేని అభిమానం చూపిస్తూ వాటి సేవ కోసం పరితపిస్తూ దాతల సహకారంతో గోశాలను ఏర్పాటు చేయడంతో మండల ప్రజలు, స్థానికులు, మార్వాడిలు, రాజస్థాన్ వాళ్ళు అభినందిస్తున్నారు. పూర్తి వివరాలకు వెళితే దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఆది వేణుగోపాల్ చిన్న వయసులోనే సామాజిక సేవ కార్యక్రమాలను చేపట్టి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.సర్పంచిగా గెలుపొందిన తర్వాత ఆయన అటు ప్రజలకు సేవ చేస్తూ, ఇటు గోవులను పెంచాలని ఆలోచన రావడంతో ఒక్కటితో 2011లో ప్రారంభమై 10 సంవత్సరాలు కావస్తుంది. గో సేవ ప్రస్తుతం చాలావరకు గోవులు ఉండడంతో ఆయన నిత్యం గోవులకు పూజ చేసిన తర్వాత ఏ పనైనా ప్రారంభిస్తారు. సర్పంచ్ గా ఐదేళ్లు ఉండి గోవులను పెంచాడు. అటు తర్వాత అందరి ఓటర్ల అభిమానంతో ఎంపీటీసీగా గెలుపొందారు. గత పది సంవత్సరాల నుంచి గోసేవకు అంకితమైన ఆది వేణు గోపాల్ నేటికి సైతం గోవులకు కావలసిన పండ్లు,గడ్డి తదితర వస్తువులను తీసుకొచ్చి నిల్వచేసి గోవులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటారు. గోవులను అమ్ముకుంటున్న ఈ రోజులలో గోవులను కొనుగోలు చేసి గో సేవకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆది వేణుగోపాల్ గో సేవలకు నేటితరం యువత అండగా నిలుస్తున్నారు.గోశాల నిర్వాహకులు ఆది వేణుగోపాల్ అభిప్రాయం.గో సేవ చేయడం అదృష్టం. గో సేవ చేయడంతో సంతృప్తి కలుగుతుంది అన్నారు. గత పది సంవత్సరాల నుంచి ఒక్క ఆవుతో ప్రారంభమై నేడు చాలా ఆవులకు సేవ చేయడంతో పాటు గోశాల ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గో సేవ చేయడానికి అందరూ ముందుకు రావాలని అన్నారు. దౌల్తాబాద్ గోశాల ఏర్పాటు చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అన్నారు.దాతల సహకారంతో గోశాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.గో సేవ చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు.

తాజావార్తలు