గౌడ సంఘం ఆధ్వర్యంలో వన భోజనాలు

మొక్కలు నాటిన అతిథులు

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి):

గణేష్ నగర్ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 9వ ఆషాడ మాస వనభోజనాల కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మానేరు డ్యాం దేవుళ్ళ పురి వద్ద గల శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం అవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ కులస్థులు ఇంటిల్లి పాది తరలివచ్చి దేవాలయ నిర్మాణ ముఖ్య కర్త ఊట్కూరి భూమయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఆలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గుడి అవరణలో మొక్కలు నాటారు. వివిధ రంగాల్లో రాణించిన వారినీ ముఖ్య అతిథులుగా వచ్చిన మోడెం సురేష్ గౌడ్ ,రిజర్వుడ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రిటైర్డ్ సిఐ మంద బుచ్చిరాం గౌడ్, రిటైర్డ్ ఎస్సై నేరెళ్ల నాగయ్య గౌడ్, కొత్తపల్లి ఎస్సై బుర్ర ఎల్లా గౌడ్, రామగుండం ఎస్సై చిప్ప రాజమౌళి గౌడ్, జిల్లా బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఆరెల్లి రాములు గౌడ్, అమరగాని శ్రీనివాస్ గౌడ్, గౌడ శంఖారావం పత్రిక ఎడిటర్, గోపా రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్మానించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గణేష్ నగర్ గౌడ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు పున్నం మల్లయ్య గౌడ్, అధ్యక్షులు పంజాల విజయభాస్కర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ సంతోష్ గౌడ్, కోశాధికారి సుధగోని ఆంజనేయులు గౌడ్, ఉపాధ్యక్షులు చీకట్ల రామస్వామి గౌడ్, సంయుక్త కార్యదర్శి కొత్తూరి రవీందర్ గౌడ్, కార్యవర్గ సభ్యులు ఆరెల్లి రాజయ్య గౌడ్, గడ్డం శ్రీనివాస్ గౌడ్, బొంగోని శ్రీధర్ గౌడ్, మొలుగూరి గణపతి గౌడ్, అన్నపురం రాజ మల్లయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.