గ్రంథాలయలను వినియోగించుకొని మేధా శక్తి పెంపొందించుకోవాలి
జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ బంగ్లా యాదయ్య గౌడ్
దోమ నవంబర్ 25(జనం సాక్షి)
గ్రంథాలయలను వినియోగించుకొని మేధా శక్తి పెంపొందించుకోవాలనీ జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ బంగ్లా యాదయ్య గౌడ్ అన్నారు. శుక్రవారం దోమ మండల కేంద్రంలోని నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవనాన్ని ఆయన సందర్శించి పలు పనులను పర్యవేక్షించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రంథాలయ రూపురేఖలు మారిపోయానని అన్నారు. గ్రంథాలయాలు భావి భారత పౌరులను తీర్చిదిద్దుతాయని, ప్రజలు,విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఉద్యోగ నిమిత్తం నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయని వాటి కనుగుణంగా గ్రంధాలయాల్లో పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు.డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ లకు జోలికి పోకుండా గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల చెర్మన్ యండి.గౌస్,ఏడవ వార్డ్ సభ్యులు వసంత్ రావ్ తదితరులు పాల్గొన్నరు.