*గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి*
మునగాల, ఆగష్టు 8(జనంసాక్షి): గ్రామ పంచాయితీలలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంపిఓ భూపాల్ రెడ్డికి, ఎంపీడీవో బి వెంకటేశ్వర్లుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ, పంచాయతీ సిబ్బందికి కూడా పిఆర్సి తరహ జీవో 60 ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన వివిధ కేటగిరీల వారిగా చెల్లించాలని, జీవో నెంబర్ 51 సవరించాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని, పీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని, ఎనిమిది గంటల పని దినాలు అమలు చెయ్యాలని, ఆదివారం పండగ సెలవులు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి, తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి వాసి మేకల వెంకటేశ్వర్లు, మామిడి వెంకటేశ్వర్లు, పరశురాములు, మల్సూర్, సుందరయ్య, సైదా నాయక్, ముత్తయ్య, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.