గ్రామపంచాయతీ కార్మికుల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.
జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 8 అక్టోబర్ 2022.
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నవంబర్ 26 27 తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ కార్మికుల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి సిఐటియు జిల్లా నాయకులు ఎస్ మల్లేష్ పిలుపునిచ్చారు
ఉప్పునుంతల, మండలంలో ఉన్న గ్రామపంచాయతీ కార్మికులను, గ్రామపంచాయతీ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికుల నవంబర్ 26 27 తేదీలలో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలంటూ అన్ని గ్రామాలు తిరిగి ప్రచారం చేయడం జరిగింది. రేపు ఉప్పునుంతల మండల కేంద్రంలో జరిగే గ్రామపంచాయతీ కార్మికుల జనరల్ బాడీ,సమావేశాన్ని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు
ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్ మల్లేష్ మాట్లాడారు గ్రామపంచాయతీ కార్మికుల చేత ప్రభుత్వం ఎట్టి చాకిరి చేయించుకుంటుంది అని అన్నారు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి కార్మికులకు కనీస వేతనం 24 వేల రూపాయల జీతాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు గ్రామపంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించాలని అన్నారు హెల్త్ కార్డులను ఇవ్వాలని సేఫ్టీ పరికరాలను ఇవ్వాలని సంవత్సరానికి రెండు జతల బట్టలు మాస్కులు గ్లౌజులు సబ్బులు నూనెలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు గ్రామపంచాయతీ కార్మికులకు పనిభారం పెరిగిపోయి చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు పని భారాన్ని తగ్గించాలని అన్నారు మున్సిపాలిటీ తరహాలో గ్రామపంచాయతీ కార్మికులకు కూడా జీతాలు చెల్లించాలని అన్నారు రేపు ఉప్పునుంతల మండల కేంద్రంలో జరిగే జనరల్ బాడీ సమావేశాన్ని 27 గ్రామపంచాయతీ ల కార్మికులు జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పునుంతల గ్రామపంచాయతీ యూనియన్ మండల అధ్యక్షులు, కలమండల సుల్తాన్,కార్యదర్శి మహిళా కార్మికులు జయమ్మ, సుగుణ,శాంతమ్మ,ఆలూరు శాంతమ్మ, వెంకటస్వామి, రాజలింగం, బాల లక్ష్మమ్మ, చిట్టెమ్మ,చెదిరి వెళ్లి పద్మ, తదితరులు పాల్గొన్నారు.