గ్రామాల్లో ప్రబలుతున్న జ్వరాలు

 

బజాంహత్నూర్‌ : మండలంలోని గోకోండ, ఏసాపుర, తుర్కపల్లి, బూతాయి తండా గ్రామాల్లో జ్వరాలు విజృంబిస్తున్నాయి. దీంతో ఈ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేటు అసుపత్రులకు చికిత్స కోసం తరలివస్తున్నారు. ఈ గ్రామాల్లో వైద్య పేవలు ముమ్మరం చేయాలని అ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.