గ్రామాల్లో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్న మోడీ ప్రభుత్వం

* 23 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం

* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) :
గ్రామాల మౌలిక వసతులకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తెలిపారు.
శుక్రవారం కరీంనగర్ మండలంలోని కమాన్ పూర్ , ఎలగందుల, చింతకుంట గ్రామాల్లో ఈజీఎస్ కింద మంజూరైన 23 లక్షల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ఉపాధి పథకం ద్వారా మోడీ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు. ముఖ్యంగా గ్రామాల్లోని అంతర్గత సిమెంట్ రహదారులు, మురికి కాలువలు ఈజీఎస్ నిధులతోనే చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈజీఎస్ నిధులతో కొత్తపల్లి మండలంలోని కమాన్ పూర్ లో ఎనిమిది లక్షల నిధులతో చేపట్టిన డ్రైనేజీ, సిసి రోడ్డు పనులు, చింతకుంటలో పది లక్షల నిధులతో చేపట్టిన రోడ్డు పనులు, ఎలగందులలో 5 లక్షలు నిధులతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించినట్లు ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కడార్ల రతన్ కుమార్, ఓబిసి మోర్చా ప్రధాన కార్యదర్శి జవ్వాజి రమేష్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి వేముల అనిల్, కోమటిరెడ్డి అంజన్ కుమార్, కూరగాయల మల్లేశం, చింతకుంట గ్రామ సర్పంచ్ మొగిలి మంజుల, వార్డు సభ్యులు దాసరి మాదవి-రవి, ఓబిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జిట్టవేని రేణు, ఎస్సీ మోర్చా పార్లమెంట్ ఇంచార్జ్ మెర్గు పర్షరాం, యువ ప్రశాంత్, సురేష్, మదు, కొమురయ్య, సదానందం, వెంకటేష్, రాజేష్, సతీష్, శ్రీనివాస్, శ్రవణ్, రాకేష్, ఎలగందల్ గ్రామానికి చెందిన ఎద్దండి షర్మిల ప్రకాష్, ఉప సర్పంచ్ బోనాల నరేష్, వార్డు సభ్యులు గొట్టే ప్రవీణ్, బోనాల ఆంజనేయులు, జంగిలి అశోక్, బోనాల ప్రతాప్, శ్రీరామ్ శ్రీనివాస్, సురేష్, సంతోష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

* కమాన్ పూర్ లో

సమాజంలో మహిళల వంటింటి కష్టాలను తీర్చాలనే గొప్ప సంకల్పంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని తీసుకు వచ్చి అర్హులైన మహిళలందరికీ వంట గ్యాస్ సిలిండర్లు, స్టవ్ లు ఉచితంగా అందిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ తెలిపారు.
కొత్తపల్లి మండలం కమాన్ పూర్ లో 8వ వార్డు సభ్యులు వేముల రాజేశ్వరి – అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మంజూరైన ఉచితగ్యాస్ సిలిండర్, స్టవ్ ల పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం రోజున ఎంపీ బండి సంజయ్ ముఖ్యఅతిథిగా హాజరై, స్థానిక మహిళలకు గ్యాస్ సిలిండర్లు, స్టవ్ లు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాల కాలం గడిచిన మహిళల వంటింటి కష్టాలు తీరలేదని, అందుకే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే మహిళలందరికీ వంటింటి కష్టాలు తీర్చాలనే లక్ష్యంతో ప్రధాని మోడీ ఉజ్వల యోజన పథకం తీసుకువచ్చారని పేర్కొన్నారు . ఇట్టిపథకంతో దేశంలోని కోట్లాది మహిళలకు, అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్లు, స్టవ్ లు ఇప్పటికే అందించడం జరిగిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఇట్టి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఇట్టి కార్యక్రమంలో కమాన్ పూర్ బిజెపి నాయకులు కుంట తిరుపతి, మెరుగు మల్లేశం, శ్రీను, సోను, ప్రణయ్, సుమన్, అభిలాష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.