గ్రామాల అభివృద్దికి ప్రజల పట్టం
అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం ఆనందం
లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే తరహా విజయం
ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు
జనగామ,జనవరి31(జనంసాక్షి): అధికార పార్టీకి ప్రజలు మద్దతు పలికి అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలపిఇంచినందున ఇక గ్రామాలు సంపూర్ణ అభివృద్ధి సాధిస్తాయని ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు, డాక్టర్ తాటికొండ రాజయ్య,ముత్తిరెడ్డ ఇ యాదగిరిరెడ్డిలు అన్నారు. అన్నివిడతల్లోనూ ప్రజలు తమపై విశ్వాసంతో టిఆర్ఎస్ను గెలిపించారని అన్నారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే అత్యధిక స్థానాలు కట్టబెట్టడంపై ప్రజలకు వారు వేర్వేరుగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇక నిరంతరాయంగా అండగా ఉంటామని, సిఎం కెసిఆర్ లక్ష్యం మేరకు గ్రామాలను అభివృద్దిలో ముందుంచుతామని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులే అధిక సంఖ్యలో విజయం సాధించారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తమ మద్దతుదారులు అధిక స్థానాల్లో గెలుపొందడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామనన్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు ప్రజలు మరోసారి పట్టం కాట్టారని అన్నారు. పార్టీ బలపర్చిన సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపొందితేనే ప్లలె ప్రగతి పథంలో పయనిస్తాయని ఓటు రూపంలో తేల్చారు. జిల్లాలో తొలి, మలి విడతలోనూ గులాబీ పార్టీ మద్దతుదారులకు పట్టం కట్టిన ప్లలె ప్రజలు.. తుది విడతలోనూ మెజార్టీ గ్రామాల్లో టీఆర్ మద్దతుదారులే విజయం సాధించడం విశేషం. మొదటి, రెండో విడతలాగే మూడో విడతలోనూ అధికార పార్టీ మద్దతుదారులు హవా కొనసాగిం చడంతో టీఆర్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. ఈసారి మహిళలకంటే పురుషులే అధికంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జనగామ డీసీపీ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో భారీ బందోబస్తు నిర్వహించారు.