గ్రామాల అభివృద్ధికి నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే

కడియం అసత్య ప్రచారాలు మానుకోవాలి
…నియోజక వర్గ ఇంచార్జీ పేరుమండ్ల వేంకటేశ్వర్లు
స్టేషన్ ఘనపూర్ , జూలై   , ( జనం సాక్షి ):
తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి నిధు లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే అని,నిజాలు తెలు కోకుండ మాజి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అసత్య ప్రచారాలు మానుకోవాలని బీజేపీ నియో జకవర్గఇంచార్జీ పేరుమండ్ల వేంకటేశ్వర్లుఅన్నారు. డివిజన్ కేంద్రంలోని ఫంక్షనల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉప ముఖ్యంత్రిగా ఉండి ఈ నియోజక వర్గానికి మీరు చేసినఅభివృద్ధి ఏమిటో కడియం చెప్పాలన్నారు.
పత్రిక సమావేశంలో కడియం శ్రీహరి భారతీయ జనతా పార్టీనీ, బండి సంజయ్ ని విమర్శించడం సిగ్గు చేటన్నారు.తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల పన్నులు విధి స్తూ తెలంగాణ ప్రజలకు రజాకర్ల పాలను తిరిగి చూపిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వంఅని అన్నారు.
ఈ నియోజక వర్గం నుండి ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రి గా పనిచేసిన కడియం శ్రీహరి కనీసం ఒక్క డిగ్రీ కాలేజ్ కూడా తీసుకురాకపోవ డం సిగ్గుచేటు అన్నారు.కడియం శ్రీహరి లాంటి విద్యావంతుడు కూడా అబద్ధాలు ప్రచారం చేయ డం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాంఅని అన్నారు.
బండి సంజయ్ న్యాయకత్వం ముందు టీఆర్ఎస్ యొక్క ఎత్తులు పారకపోవడంతో ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలియచేశారు.
రైతులకు 6 వేల రూపాయలు ఆడవారి అత్మగౌర వానికి భంగం కలగకుండా మరుగుదొడ్లు, రోడ్లు, స్మశాన వాటికలు, నర్సరీలు, ఇలా ప్రతి ఒక్క పని లో కేంద్ర ప్రభుత్వం యొక్క వాట అధికంగా ఉంది అనితెలియచేశారు.బీజేపీ కార్యకర్తలపై,కక్షసాధిం పు చర్యలకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్ప డుతున్నారని బీజేపీ నాయకుల, కార్యకర్తల జోలికి వస్తే చూస్తు ఊరుకునేది లేదని అన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటూ పార్టీని బలపరుస్తాం అని తెలిపారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ జిల్లా కార్యవర్గసభ్యులు బుర్ర తిరు పతి గౌడ్,బీజెవైఎం జిల్లాఉపాధ్యక్షులు ప్రజ్ఞపురం ఆంజనేయులు, జాఫర్ ఘడ్ మండలం ప్రధాన కార్యదర్శి కోరుకొప్పుల నాగేష్ గౌడ్ ,దళిత మోర్చ మండల అధ్యక్షుడు ఇల్లందుల సారయ్య, మండ ల ఉపాధ్యక్షుడు గాదేపాక శ్రీను,గీత సెల్ మండల కో కన్వీనర్ కోరుకొప్పుల నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.