గ్రామాల వారీగా సమన్వయ సమితి సభ్యుల సహకారం
ఆదిలాబాద్,మే9(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రైతు సమన్వయ సమితి సభ్యులకు ఆదేశాలు అందాయి. ప్రబుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమంలో భాగస్వాముల అయి సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర సమన్వయ సమితి కన్వీనర్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. దీంతో మండలస్థాయిలో సమితి సభ్యులు గ్రామాలకు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. మండల కేంద్రంలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో పాటు రైతు సమన్వయ సమితి గ్రామ కో-ఆర్డినేటర్లతో ఇప్పటికే ప్రత్యేక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 10 నుంచి పంపిణీ చేయనున్న చెక్కులకు సంబంధించి గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. గ్రామాలవారీ గా చెక్కుల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేందుకు అధికారులకు రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్లు సహకరించనున్నారు.