గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు అరుదైన వైద్య సేవలు అందించడమే తమ హాస్పిటల్ లక్ష్యం -లిమ్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ విశ్వనాథ్

ఇబ్రహీంపట్నం, నవంబర్ 10 ( జనంసాక్షి ) : గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు అరుదైన వైద్య సేవలు అందించడమే తమ హాస్పిటల్ యొక్క లక్ష్యమని లిమ్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ విశ్వనాథ్ అన్నారు. ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో వైద్యులు అరుదైన వైద్య సేవలు అందించారు. మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామానికి చెందిన కాలే యాదయ్య (55) తనకున్న వ్యవసాయ పొలంలో దాదాపూ 50 కేజీలు ఉన్న వరి గడ్డి కట్టలు ట్రాక్టర్ లో నింపుతున్నారు. అందులో వేసే క్రమంలో యాదయ్య వరీ గడ్డి కట్ట ట్రాక్టర్ లో నుంచి జారీ యాదయ్య మెడపై పడడంతో ఆయన అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. హుటాహుటిన గ్రామంలోని ఆసుపత్రికి తరలించగా ఉత్తమ వైద్యం కోసం ఇబ్రహీంపట్నం లోని లిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వెళ్ళాలని వైద్యులు సూచించారు. లిమ్స్ ఆసుపత్రి వైద్య బృందం స్కానింగ్ నిర్వహించగా యాదయ్య మెడ భాగం లోపల ఎముక ఫ్రాక్చర్ అయిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో మెడ ఎముక సరైన స్థితిలోకి చేరాలంటే ఆపరేషన్ తప్పనిసరి అని వైద్యులు సూచించారు. దీంతో లిమ్స్ వైద్య బృందం సర్జరీ చేసి సరైన వైద్యం అందించగా విజయవంతం అయ్యిందని తెలిపారు. ఈ తరహా సర్జరీ పట్నం ఆస్పత్రిలో నిర్వహించడం చరిత్రలో ఇదే ప్రథమం అని వైద్యులు అన్నారు. దీంతో చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు లిమ్స్ హాస్పిటల్ వైద్య బృందాన్ని అభినందించారు. ఇలాంటి మంచి కార్యకర్తలు భవిష్యత్తులో మరిన్ని చేయాలని ప్రజలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ్ (కార్డియాలజిస్ట్), అభిలాష్ (ఆర్థో), గౌతమ్ రెడ్డి (అనస్థీషియా), గౌతమ్ రెడ్డి (న్యూరో సర్జన్), దినేష్ (ఫైజిషియన్), మార్కండేయ (పీడియాట్రీషియన్), రామరాజు (జనరల్ సర్జన్), లౌక్య (గైనకాలజిస్ట్), చంద్రహాస్ (జనరల్ సర్జన్) హాస్పిటల్ మేనేజర్ కాలే భాషా, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.