గ్రామీణ వ్యవసాయ స్థితిగతులను అధ్యయనం చేస్తున్న లయోలా కళాశాల విద్యార్ధినుల బృందం
గరిడేపల్లి, ఆగస్టు 24 (జనం సాక్షి):గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా లయోల కళాశాలకు చెందిన బియస్సి వ్యవసాయ డిగ్రీ కోర్సు విద్యార్థునిలు గ్రామీణ వ్యవసాయ విధానాలు స్థితిగతులను తెలుసుకొని గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణ కార్యక్రమం ద్వారా అధ్యయనం చేసినట్లు ఇంచార్జి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ బి లవ కుమార్ తెలియజేశారు. బుధవారం గడ్డిపల్లి గ్రామ పంచాయతీ అవారణలో నిర్వహించిన గ్రామీణ అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొని పరిశీలించారు.ఈ ప్రక్రియలో విద్యార్థినులు గ్రామంలో పర్యటించి రైతులతో సంభాషించి వారి సమస్యలను గురించి తెలుసుకొని వాటి పరిష్కరించడానికి గాను గ్రామ పటం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వెన్ డయాగ్రమ్ పై చార్ట్ చిత్రాల రూపంలో ప్రదర్శించి గ్రామీణ రైతులకు అవగాహన కల్పించినట్లు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో గ్రామం యొక్క వనరులను గ్రామ పటం ద్వారా చిత్రీకరించి గ్రామంలోని అక్షరాస్యత వైద్య సదుపాయాలు ప్రజా సంరక్షణ పశు పోషణ రవాణా సేవ రైతుల వర్గీకరణ భూముల రకాలు జనాభా భౌగోళికప్రాంతం వ్యవసాయ పంటల సాగు దిగుబడులు చీడ పీడల నివారణకు ఆచరిస్తున్న మొదలగు విధానాలు గ్రామ వనరులు తదితర అంశాలపై చార్ట్ లో చిత్రీకరించి రైతులకు అవగాహన కలిపించారు.ఈ కార్యక్రమంలో కె.వి.కె శాస్త్రవేత్తలు సీనియర్ శాస్త్రవేత్త బి. లవ కుమార్, ఎన్. సుగంధి, టి.మాధురి గ్రామ కార్యదర్శి సైదా, బిల్ కలెక్టర్ రాజ లింగయ్య, లయోల కళాశాల వ్యవసాయ విద్యార్థునిలు సి.ఆర్.అక్షిత, డి.ప్రసన్న, ఎ.హరిణి, సి.హెచ్.దివ్య, ఎ.ప్రేరణ జి.హర్షిత లతో పాటు రైతులు సత్తిరెడ్డి , వెంకటేశ్వర్లు, మేకల శ్రీను, బోడయ్య, రామారావు, సైదులు, అరవింద్,లక్ష్మయ్య, తిర్పమ్మ, దుర్గమ్మ, పిచ్చమ్మ లు పాల్గొన్నారు.