గ్రామీణ స్థాయి విద్యార్థుల క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తా.గ్రామీణ స్థాయి విద్యార్థుల క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తా.ప్రతి జిల్లాకు కోటి రూపాయల కార్పొరేట్ ఫండ్ ను ఏర్పాటు. -ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ఎస్ విజయ్ కుమార్.

 

 

 

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్13(జనంసాక్షి):
గ్రామీణ స్థాయి నుంచి విద్యార్థుల క్రీడలను ప్రోత్సహించేలా ప్రతి జిల్లాకు కోటి రూపాయల కార్పొరేట్ ఫండ్ ను ఎమ్మెల్సీ నిధులనుండి ఏర్పాటు చేసి పాఠశాలల క్రీడలకు ప్రాధాన్యత కల్పించేలా కృషి చేస్తానని మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ఎస్ విజయ్ కుమార్ అన్నారు.మంగళవారం నాగర్ కర్నూల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులకు కొనసాగు తున్న శిక్షణ తరగతులను ఆయన సందర్శించి మాట్లాడుతూ….నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన తాను బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ సంఘం బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వ్యాయామ ఉపాధ్యాయులను మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థించారు.వ్యాయామ ఉపాధ్యాయుల పదోన్నతికై కృషి చేస్తానన్నారు.గ్రామీణ స్థాయి క్రీడలను బలోపేతం చేసే దిశగా ఎమ్మెల్సీ నిధుల నుండి ప్రతి జిల్లాకు కోటి రూపాయల నిధితో కార్పొరేట్ ఫండ్ ను ఎమ్మెల్సీ నిధుల నుండి ఏర్పాటుచేసి గ్రామీణ స్థాయి విద్యార్థులు రాష్ట్ర జాతీయస్థాయిలో పాల్గొనేలా కృషి చేస్తానన్నారు.కేజీబీవీ లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ,జీతాల పెంపుదలపై కృషి చేస్తానని అన్నారు.విద్యా సమస్యలన్నీటిపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అన్ని సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానన్నారు.జిల్లాలోని ఓటు కలిగిన ప్రతి ఉపాధ్యాయు డు తనకు మొదటి ప్రాధాన్యత ఓటుతో చట్టసభలకు పంపేలా కృషి చేయాలన్నారు.బహుజన ఉపాధ్యాయుల సమస్యలతో పాటు కేజీబీవీ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చట్టసభల్లో తన వాణి వినిపించేలా తనకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు.అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణుడుఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణుడు మాట్లాడుతూ… ఉపాధ్యాయుల సమస్యల కృషికి పోరాడే వ్యక్తినీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బలపరిచామని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన విజయ్ కుమార్ ను ప్రతి ఒక్కరూ బలపరచాలని కోరారు.విద్యావంతుడు ఎమ్మెల్సీ గా ఉంటే విద్యకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.చట్టసభల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించే దిశగా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భాస్కర్ వెంకటయ్య స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ప్రసాద్ గౌడ్ వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు