*గ్రామ సేవకుల 58వ రోజు కొనసాగిన నిరవధిక సమ్మె*

మునగాల, సెప్టెంబర్ 20(జనంసాక్షి): గత 57 రోజులుగా తహశీల్దార్ కార్యాలయం ముందు మండల గ్రామ సేవకులు 58వ రోజు కూడా నిరవధిక సమ్మెను కొనసాగించారు. తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు మంగళవారం మునగాల మండల తహశీల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. విఆర్ఏలకు పేస్కెల్ జీవో ను వెంటనే విడుదల చేయాలని, అర్హత కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్స్ కల్పించాలని తెలిపారు. 55 సంవత్సరములు నిండిన విఆర్ఏల స్థానంలో వారసులకు ఉద్యోగాలు కల్పించాలని ఈ సందర్బంగా వ్యక్తపరుస్తూ వారి ప్రధాన డిమాండ్లను(ముఖ్యమంత్రి హామీలు) అమలుచేయాలని సీఎం కెసిఆర్ ను కోరారు . ఈ కార్యక్రమంలో విఆర్ఏలు గట్టు ఉపేందర్, నరేష్, ఖాసీం, శేఖర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.