గ్రీన్‌పార్క్‌స్టేడియంపై ఆసీస్ బృందం అసంతృప్తి
కాన్పూర్, డిసెంబర్ 15: భారత్-ఆస్టేల్రియా జట్ల మధ్య వచ్చే ఏడాది జరగనున్న టెస్ట్ సిరీస్‌లో ఒక వేదిక మారే అవకాశం కనిపిస్తోంది. మూడో టెస్టుకు ఆతిథ్యమివ్వనున్న కాన్పూర్ గ్రీన్‌పార్క్ స్టేడియంపై ఆస్టేల్రియా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేయడమే దీనికి కారణం. స్టేడియం పునర్మిర్మాణ పనులు వేగవంతంగా జరగడం లేదని చెప్పారు. వచ్చే ఏడాది తమ జట్టు పర్యటన నిమిత్తం భారత్‌లో ఏర్పాట్లు, భద్రతకు సంబంధించి పరిశీలన జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఆసీస్ బృందం ఇక్కడ పర్యటిస్తోంది. తమ పర్యటనలో భాగంగా మూడో టెస్ట్ జరిగే గ్రీన్‌పార్క్ స్టేడియాన్ని కూడా సందర్శించింది. అయితే భద్రతా ఏర్పాట్లతో పాటు స్టేడియం ఆధునీకరణ పనులపై వారు అసంతృప్తితో ఉన్నారు. అనుకున్నంత వేగంగా పనులు జరగడం లేదని గత వారమే బీసిసిఐ కూడా నిర్వాహకులను మందలించినా ఫలితం లేకపోయింది. ఇదే రీతిన కొనసాగితే మ్యాచ్ సమయానికి స్టేడియం సిధ్ధం కావడం కష్టమని ఆసీస్ బృందం భావిస్తోంది. ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం నాలుగు టెస్టుల సిరీస్‌లో మూడో మ్యాచ్ మార్చి 14 నుండి 18 వరకూ జరగనుంది. ఆసీస్ ప్రతినిధుల అసంతృప్తితో తేరుకున్న బీసిసిఐ ఉత్తర్‌ప్రేదశ్ క్రికెట్ అసోసియేషన్‌కు 15 రోజుల గడువు విధించింది. గడువు లోపల స్టేడియం సిధ్ధం కాకుంటే వేదిక మారుస్తామని హెచ్చరించింది. ఒకవేళ వేదిక మార్చాల్సి వస్తే ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం హైదరాబాద్‌కు దక్కనుంది. ఇప్పటికే ప్రత్యామ్నాయ వేదికగా రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియాన్ని బీసిసిఐ నిర్ణయించినట్టు సమాచారం. ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌కు హైదరాబాద్ స్టేడియం ఆతిథ్యమిచ్చింది. ఇదిలా ఉంటే గ్రీన్‌పార్క్ స్టేడియంలో టెస్ట్ జరిగి మూడేళ్ళవుతోంది. ఈ స్టేడియంలో చివరిసారిగా 2009లో శ్రీలంకతో మ్యాచ్ జరిగింది. 2010లో సౌతాఫ్రికాతో ఇక్కడ జరగాల్సిన మ్యాచ్ కూడా ఏర్పాట్లు లేక గ్వాలియర్‌కు మార్చారు. కాగా ఆటగాళ్ళ డ్రెస్టింగ్ రూమ్, డైనింగ్ రూమ్ కూడా సరిగా లేదని ఆసీస్ ప్రతినిధులు బీసిసిఐకి రిపోర్ట్ చేశారు. అలాగే కాన్పూర్‌లో ఫైవ్ స్టార్ ¬టల్ కూడా లేకపోవడంతో వేదికగా మార్చాలని ఆసీస్ బృందం బోర్డును కోరింది. దీని ప్రకారం చూస్తే మూడో టెస్ట్ హైదరాబాద్‌కు మారడం ఖాయంగా కనిపిస్తోంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు మొహాలీ, చెన్నై, ఢిల్లీ ఆతిథ్యమిస్తున్నాయి. కేవలం టెస్టులు మాత్రమే ఆడేందుకు ఆస్టేల్రియా జట్టు ఫిభ్రవరిలో భారత్‌కు రానుంది.