గ్రీన్ ఇండియా ఛాలెంజ్
ముస్తాబాద్ జులై 6 జనం సాక్షి
తమ పెళ్లి రోజు సందర్భంగా మొక్కలు నాటిన ముస్తాబాద్ పట్టణ తెరాస పార్టీ మాజీ అధ్యక్షులు రాచమడుగు సంతోష్ రావు అరుణ దంపతులు.జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ తెరాస పార్టీ మాజీ అధ్యక్షులు రాచమడుగు సంతోష్ రావు అరుణ దంపతులు.ఈ కార్యక్రమంలో సంతోష్ రావు మాట్లాడుతూ మొక్కలు నాటడం చాలాసంతోషంగా ఉందని అన్నారు.ప్రకృతి కన్నతల్లి లాంటిది కన్నతల్లి ని ఎలా ప్రేమగా చూసుకుంటామో అదే విదంగా మన ప్రకృతి ని,కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు పర్యావరణ పరిరక్షిద్దాం రాబోయే బావి తరాలకు మంచి వాతావరణం అందిద్దామని కోరారు.ఇంత మంచి గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యులను చేసినందుకు గౌ, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు