గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : టిఎస్ పిఎస్ సి చైర్మన్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి
జిల్లాలో పకడ్బందీగా గ్రూప్ -1 ప్రిలిమ్స్ నిర్వహిస్తాం : జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): ఈ నెల 16న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా, ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని టిఎస్ పిఎస్ సి చైర్మన్ డాక్టర్ బి జనార్ధన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు.బుధవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు,సీఎస్ లు , లైసన్, అసిస్టెంట్ లైజన్ అధికారులతో ఈ నెల 16న జరిగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏర్పాట్లపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 3.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని,ఇప్పటివరకు 2.43 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్ లౌడ్ చేసుకున్నారని అన్నారు.అభ్యర్థులు తమ హాల్ టికెట్లను https: www.tspsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని,అందులోని సూచనలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.గ్రూప్-1 ప్రిలిమ్స్ 16న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు ఉంటుందని అభ్యర్థులు 2 గంటల ముందే ( ఉదయం 8.30)వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. గ్రూప్ -1 లో తొలిసారిగా బయోమెట్రిక్ ఉంటుందని, అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.అభ్యర్థులు తమ హాల్ టికెట్ తో పాటు ఒక ఐడిని ఒరిజినల్ ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఎంప్లాయ్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ , పాస్ పోర్ట్ లలో ఏదైనా ఒక ఐడీని తీసుకురావాలని అన్నారు.హాల్ టికెట్ పై ఫోటో, సంతకం లేనిపక్షంలో వారు గెజిటెడ్ అధికారిచే సక్రమంగా ధృవీకరించిన మూడు పాస్ పోర్ట్ ఫోటోలు తీసుకురావాలని,నిర్ణీత ప్రొఫార్మాలో పరీక్ష కేంద్రంలో అప్పగించాలన్నారు.అభ్యర్థును పరీక్ష హాల్లోకి అనుమతించే ముందు పరీక్ష వేదిక ప్రవేశద్వారం వద్ద పరిశీలిస్తారని, ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని,అభ్యర్థులు చెప్పుల మాత్రమే ధరించి రావాలని,బూట్లకు అనుమతి లేదన్నారు. పరీక్ష కోసం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే అనుమతించబడుతుందని అన్నారు.ఫిజికల్ హ్యాండ్ క్యాప్ అభ్యర్థులకు గ్రౌండ్ ఫ్లోర్ లోనే సీటింగ్ కల్పించారని,అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్, ఓఎంఆర్ జవాబు పత్రంలో బుక్లెట్ సంఖ్య, వేదిక కోడ్ సరిగ్గా వేయాలన్నారు. సిరీస్ ఏ, బి, సి, డి నుండి ఆరు అంకెల సంఖ్యకు మార్చబడిందని తెలిపారు.ఓఎమ్ఆర్ జవాబు పత్రంపై వైటనర్ ,చాక్ పవర్, బ్లేడ్, ఎరేజర్ ఉపయోగించరాదన్నారు.పరీక్ష పూర్తయ్యేవరకూ అభ్యర్థులెవరూ పరీక్ష హాలు నుండి బయటకు వెళ్ళకూడదని అన్నారు.పరీక్ష కేంద్రాలు, చుట్టుపక్కల ఫోటోస్టాట్ కాపీయింగ్ జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నారు.పరీక్షా కేంద్రాలు, చుట్టుప్రక్కల 144 సెక్షన్ విధించాలన్నారు.అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరేందుకు అదనపు బస్సులు ఏర్పాటు చేయవలసిందిగా ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.పరీక్ష కేంద్రాల్లో ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్, త్రాగునీరు ఉండేలా చూడాలన్నారు.పరీక్షను సజావుగా ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ మాట్లాడుతూ గ్రూప్ – 1 ప్రిలిమినరీ పరీక్షను సూర్యాపేట జిల్లాలో పకడ్బందీగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.జిల్లాలో 9181 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, వీరి కోసం 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.31 చీఫ్ సూపరిండెంట్లు,12 లైసన్ ఆఫీసర్లు, 31 అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు, అన్ని సీఎస్ రూమ్ లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు , కళాశాలల ప్రిన్సిపాల్స్ , వైస్ ప్రిన్సిపాల్, తహశీల్దార్, నాయబ్ తహశీల్దార్, జిల్లా అధికారులను నియమించడం జరిగిందని , అభ్యర్థులు నియమ నిబంధనలు అతిక్రమించినచో క్రిమినల్ చర్యలు తీసుకోబడునని తెలిపారు.ఈ సమావేశంలో టిఎస్పిఎస్సి సెక్రటరీ అనిత రాంచంద్రన్, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు , ఆర్డిఓ రాజేంద్ర కుమార్ , డిఈఓ అశోక్ , ఏఓ శ్రీదేవి , పర్యవేక్షకులు చంద్రశేఖర్ , చీఫ్ సూపరింటెండెంట్లు , లైసన్, అసిస్టెంట్ లైసన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area