గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించాలి

–జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్.
సంగారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 14:(జనం సాక్షి):
  జిల్లాలో ఈ నెల 16న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు  శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించాలని, అందుకు ఆయా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్  కోరారు.
శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రూప్ వన్ పరీక్షల ఏర్పాట్లు, చీఫ్ సూపర్డెంట్లు, లైజన్ అధికారులు, సహాయ లైజనింగ్ అధికారులకు పరీక్ష నిర్వహణ పై పునఃశ్చరణ పై సమావేశం నిర్వహించారు.
 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ -1పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని,  పబ్లిక్ సర్వీస్ కమిషన్  సూచనలను తూచా తప్పకుండా అమలు చేయాలన్నారు. గైడ్లైన్స్ అతిక్రమించరాదన్నారు.
 జిల్లాలో 26 కేంద్రాలలో 8654 మంది అభ్యర్థులు  పరీక్షలకు హాజరుకానుండగా,26 మంది చీఫ్ సూపర్డెంట్ లను నియమించామని తెలిపారు.  6 రూట్లు ఏర్పాటు చేసి  6 మందిని లైయిజన్ అధికారులను  నియమించామని అలాగే  26 మందిని సహాయ లైజన్ అధికారులను ఏర్పాటు చేశామన్నారు.
ఆయా అధికారులు అత్యంత జాగ్రత్తగా తమ బాధ్యతలను నిర్వర్తించాలన్నారు.
వాచ్ తో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్ అనుమతించవద్దని స్పష్టం చేశారు. బ్లాక్/ బ్లూ బాల్ పాయింట్ పెన్ హాల్ టికెట్, ఐడి కార్డ్ మాత్రమే అనుమతిస్తారని పేర్కొన్నారు.
  అభ్యర్థులను పరీక్ష రాసేందుకు 16వ తేదీ ఉదయం 8:30 కి పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందని, 10:15 తర్వాత పరీక్షా కేంద్రం గేటు మూసివేసి వేస్తారని తెలిపారు.
 అభ్యర్థులు ఎలాంటి బూట్లు ధరించకుండా సాదాసీదాగా   చెప్పులు లేదా స్లిప్పర్లు వేసుకొని రావాలని సూచించారు.
 అన్ని పరీక్ష కేంద్రాల్లో  డ్యూయల్ డెస్కులు ఏర్పాటు చేయాలని తెలిపారు. పరీక్షా కేంద్రానికి వంద మీటర్ల పరిధిలో గల అన్ని జిరాక్స్ మరియు ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయించాలన్నారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.పరీక్ష పూర్తయ్యే వరకు ఎవరిని బయటకు పంపరాదని తెలిపారు.
అందరి సమన్వయంతో జిల్లాలో గ్రూప్ వన్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో అధినపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, డిఆర్ఓ రాధికారమని, డిఇఓ, డి ఆర్ డి ఓ, జెడ్పిసిఈఓ, ఎస్సీ ట్రాన్స్కో, డి ఎం ఎం హెచ్ ఓ, మహిళా శిశు సంక్షేమ అధికారి, రెవిన్యూ డివిజనల్ అధికారులు, చీఫ్ సూపర్డెంట్లు, లైజనింగ్, సహాయ లిజనింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail