గ్రేటర్ ఊపులో సరికొత్త వ్యూహాలు
ఖమ్మం,వరంల్ కార్పోరేషన్లపై దృష్టి
వరంగల్,డిసెంబర్5 (జనంసాక్షి) : గ్రేటర్ ఊపులో ఉన్న బిజెపి నేతలు ఇక రానున్న వరంగల్ కార్పోరేషన్, ఖమ్మం స్థానాలపై దృష్టి సారించనున్నారు. ఇక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు అప్పుడే చర్చలు మొదలు పెట్టారు. దుబ్బాక తరవాత గ్రేటర్ వంటి వరుస విజయాలు పార్టీ శ్రేణుల్లో కదనోత్సా హం వెల్లివిరిస్తున్నది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్య విజయాలను సొంతం చేసుకున్న బీజేపీ రాష్ట్రంలో ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయశక్తిగా రూపొందామని సవాల్ విసురుతున్నది. 2022లోనే పార్లమెంట్‌కు, అసెంబ్లీకి జమిలి ఎన్ని కలు జరుగుతాయని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో జిల్లాల్లో పట్టు బిగించేందుకు వ్యూహరచన చేయనున్నారు. ఊపువిూదున్న పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా రాబోయే రోజుల్లో విజయం సాధించేందుకు వీలుగా నిరంతరం ప్రజా సమస్యలపై ఉద్యమించే అవకాశాలు ఉన్నాయి. బండి సంజయ్ అధ్యక్షతన రాష్ట్రంలో ఘనవిజయాలు సాధిస్తున్న నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ నాటికి జిల్లాల్లో పబలోపేతం కావాలన్న యోచనలో నేతలు ఉన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర అధ్యక్షుడి ¬దాలో పార్టీని గెలిపిస్తే ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల్లో అప్పుడే చర్చ జరుగుతున్నది. రాబోయే రోజుల్లో జరిగే అన్ని ఎన్నికల్లోనూ పార్టీ విజయ పరంపర కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేసిన బండి సంజయ్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్ని కల్లో ఆయన కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కుడి భుజంగా వ్యవహరించే బోయినపల్లి వినోద్‌కుమార్‌పై 85 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ సందర్భంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలిగింటిలో బీజేపీ టీఆర్‌ఎస్ కంటే ఎక్కువ ఓట్లను సాధించింది. ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఇప్పటి నుంచే నియోజకవర్గాలపై దృష్టిసారించి ప్రజా సమస్యలపై ఉద్య మాలు చేపడుతూ పట్టు బిగించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలిసింది. పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారని చెబుతున్నారు. 2021 ఆరంభం నుంచే బీజేపీ తన రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేయనున్నదని సమాచారం.