గ్రేట్‌ర్‌ప్రణాళిక

4

– వందరోజుల అభివృద్ధికి రూట్‌మాప్‌

– మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ వెల్లడి

హైదరాబాద్‌,ఫిబ్రవరి 18(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి వంద రోజుల ప్రణాళికను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. వందరోజుల్లో చేపట్టాల్సిన పనలును ఆయన వెల్లడించారు. ఈ పనుల పురోగతిని మూడునెలల తరవాత వెల్లడిస్తానని గురువారం నాడాయన విూడియా సమావేశంలో వివరించారు. ఉదయం మంత్రి విూడియాతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో ఏకకాలంలో భవనాలకు అనుమతులు మంజూరు చేస్తామన్నారు.  వంద రోజుల్లో ఆన్‌లైన్‌ అనుమతుల పక్రియకు శ్రీకారం చుడుతామని ప్రకటించారు. గతంలో భవనాలకు అనుమతుల కోసం ఏళ్ల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కేవలం 30 రోజుల్లో భవనాలకు అనుమతులపై వివరాలు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డ్‌ కమిటీలు, ఏరియా కమిటీలు ప్రారంభించబోతున్నామని తెలిపారు. నగరంలో రూ. 200 కోట్లతో 569 బీటీ రహదారుల నిర్మాణం చేపడుతామని వెల్లడించారు. రూ. 30 కోట్లతో నగరంలో నాలాల క్రమబద్దీకరణ చేపడుతామన్నారు.  కోటి వ్యయంతో 10 శ్మశానవాటికల నిర్మాణం చేపడుతామని పేర్కొన్నారు. మరో3 కోట్ల వ్యయంతో 50 బస్‌బేల నిర్మాణం చేపడుతాం. రూ. 26 కోట్లతో 40 మోడల్‌ మార్కెట్ల నిర్మాణం చేపడుతామన్నారు. 20 కోట్లతో లేఅవుట్లకు ప్రహరీ గోడలు నిర్మించి పరిరక్షిస్తామన్నారు. నగరంలో చెత్త తరలింపునకు 2,500 స్వచ్ఛ ఆటోల ద్వారా సేవలందిస్తామని చెప్పారు. నగరంలో 20 కాలనీల్లో పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. హుస్సేన్‌ సాగర్‌లోకి మురికి చేరకుండా చర్యలు తీసుకుంటున్నామని, మూడుదశల్లో దీనిని ప్రక్షాళన చేస్తామని అన్నారు. ఆ మహిళా సంఘాలకు వంద రోజుల్లో వంద కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ-ఆఫీస్‌ ద్వారా ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. యూత్‌క్లబ్‌, అసోసియేషన్ల సహకారంతో జిమ్స్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 359 క్రీడా మైదానాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సలహాలు, ఫిర్యాదుల కోసం జీహెచ్‌ఎంసీ పోర్టల్‌ రూపొందిస్తామని చెప్పారు. సమస్యలపై ఫిర్యాదు కోసం హెచ్‌ఎండీఏ టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డు కమిటీలు, ఏరియా కమిటీలు ప్రారంభించబోతున్నట్లు కూడా వెల్లడించారు.  గతంలోలా భవనాల అనుమతులకోసం ఏళ్ల తరబడి తిరగాల్సిన పరిస్థితి లేకుండా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలో ఏకకాలంలో భవనాలకు అనుమతులు వచ్చేలా కార్యాచరణ రూపొందించామని అన్నారు.  వంద రోజుల్లో ఆన్‌లైన్‌ అనుమతుల పక్రియకు శ్రీకారం చుడతామన్నారు. ఇకనుంచి కేవలం 30 రోజుల్లో భవనాలకు అనుమతులపై వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇకపోతే నగరంలో పచ్చదనానికి పెద్దపీట వేస్తామని అన్నారు.  మే 31లోగా 3.5కోట్ల మొక్కలను ప్రజలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.  యూత్‌క్లబ్‌, అసోసియేషన్ల సహకారంతో జిమ్‌లు ఏర్పాటు చేస్తామన్న మంత్రి  జూన్‌ 2 నాటికి వంద రోజుల ప్రణాళికపై సవిూక్ష నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. విూడియా సమావేశంలో మున్పిపల్‌ కార్యదర్శి ఎంజి గోపాల్‌, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ తదితరులు పాల్గొన్నారు.