గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ హైదరాబాద్
– ‘ఈయాప్‌సిస్’ ప్రారంభోత్సంలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్(జనంసాక్షి):ప్రపంచ సాంకేతిక, ఇన్నోవేషన్ కేంద్రంగా హైదరాబాద్ స్థానం మరింత బలపడిరదని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్ ‘ఈయాప్‌సిస్’ సంస్థ విస్తరించిన గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సర్వీస్ ఆధారిత కంపెనీలు నడపడం తేలిక కానీ, ప్రొడక్టు ఆధారిత కంపెనీలు ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటాయని అన్నారు. టెక్‌హబ్‌గా హైదరాబాద్‌కు పెరుగుతున్న గుర్తింపు ప్రశంసనీయమన్నారు. సాఫ్ట్‌వేర్‌ప్రొడక్ట్స్ ఎగుమతుల్లో తెలంగాణను అగ్రస్థానంలో ఉంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. కంపెనీలు యూనికార్న్ స్థాయిని సాధించే లక్ష్యంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.ఏఐ సాంకేతికత ప్రభావాన్ని ఆయన వివరించారు. విద్యార్థులు, వృత్తి నిపుణుల కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోర్సులను, ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా ఆయన ప్రకటించారు. గతంలో మూడు మాత్రమే ఉన్న యూనికార్న్?లు ఇప్పుడు హైదరాబాద్‌లో 30%-%40కి పెరిగాయని ఆయన గుర్తుచేశారు. 400 ఉన్న ఈ కొత్త కార్యాలయం సామర్థ్యం భవిష్యత్తులో 4%-%6 రెట్లు పెరిగి రాష్ట్రం, నగరానికి మరింత గుర్తింపును తెస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. యూకే ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ గ్లోబల్ ఒరాకిల్ భాగస్వామి, ఐటీ సేవల సంస్థ, హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న 200 మంది సిబ్బందిని వచ్చే రెండు సంవత్సరాల్లో 500 మందికి పైగా పెంచాలని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విస్తరణలో భాగంగా అత్యాధునిక 400 సీట్ల సామర్థ్యంతో కూడిన కొత్త సౌకర్యాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్‌లో జోడిరచడం ద్వారా, హైదరాబాద్‌ను ఒరాకిల్ క్లౌడ్, ఈఆర్పీ, ఏఐ ఎంటర్‌ప్రైజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సర్వీసులకు వ్యూహాత్మక కేంద్రంగా మరింత బలపడనుంది. ఈ ఎన్నోవేషన్ సెంటర్ తమ ప్రయాణంలో ఒక పెద్ద మైలురాయి అని ఛైర్మన్ ప్రవీణ్‌రెడ్డి బద్దం అన్నారు. ఇది తమకు, గ్లోబల్ కస్టమర్లకు మరింత సమర్థవంతగా మద్ధతు ఇవ్వడమే కాకుండా, కొత్త సాంకేతికతో ముందుకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త సెంటర్ ద్వారా ఒరాకిల్ క్లౌడ్/ఈఆర్పీ కన్సల్టెంట్లు, ఏఐ/ఎంఎల్ ఇంజినీర్లు, సొల్యూషన్ ఆర్కిటెక్టులు, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ స్పెషలిస్టులు లాంటి వందలాది అధిక నైపుణ్యాల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుంది. స్థానికంగా ఉన్న యువతను మరింత అభివృద్ధి చెందించేందుకు, ఈ ప్రాంత టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసేందుకు అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లలో కూడా పెట్టుబడులు పెడుతోంది.