ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మున్సిపాలిటీ కేంద్రంలో ఎమ్మెల్యే విస్తృత పర్యటన
మోత్కూరు మార్చి 9 జనంసాక్షి : మున్సిపాలిటీ కేంద్రంలో మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా అంగడి బజారు లో ఉన్న ప్రాథమిక పాఠశాల గాంధీ నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పరచిన పనులను గురువారం తుంగతుర్తి శాసన సభ్యులు డా.గాధరి కిశోర్ కుమార్ ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన బడ్జెట్ కౌన్సిల్ సమావేశం లో పాల్గొని మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. అలానే స్థానిక మార్కెట్ యార్డు లో నిర్వహించిన వడ్డీ లేని రుణాల కార్యక్రమం లో పాల్గొని 9746000 రూపాయల విలువైన చెక్కును మండల మహిళా సమాఖ్య సంఘాలకు అందించారు. వీటితోపాటు కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి, కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులకు ప్రోత్సహాక చెక్కులను అందించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కిశోర్ కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని ఉద్దేశించి దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రం లో మహిళలకు అన్ని రంగాలలో సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. కొత్తగా ఆరోగ్య మహిళ 8 రకాలు పరీక్షలను ప్రతి మంగళవారం ఉచితంగా చేస్తారన్నారు. దేశంలోనే సీఎం కెసిఆర్ మహిళల అభ్యున్నతి కి కృషి చేస్తున్నారని అన్నారు. పాఠశాలలో చదువుకుంటున్న బాలికలకు నెలసరి కిట్టు, ఆడపిల్ల వివాహానికి కళ్యాణ లక్ష్మి , ఆడపిల్ల గర్భం దాలిస్తే ఆరోగ్య మిత్ర తల్లి కడుపు లో ఉన్న బిడ్డ ఎదుగుదల కోసం న్యూట్రిషన్ కిట్టు, కాన్పు అయిన అనంతరం కెసిఆర్ కిట్టు, 13000 వేల రూపాయలు నగదు ఇవ్వటం , వడ్డీలేని రుణాలు మహిళలకు అందించడం , డబుల్ బెడ్ ఇల్లు మహిళల పేరు మీదే ఇవ్వడం,ఒంటరి మహిళలకు పెన్షన్ తదితర పథకాలను ప్రవేశ పెట్టి అమలు పరుస్తూ దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా మహిళల అభ్యున్నతి కి పాటు పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. కావున పని చేసే ప్రభుత్వానికే పట్టం కట్టే విధంగా మహిళమనులు నడుం కట్టలన్నరు. గతంలో కంటే భిన్నంగా నేడు అన్ని రంగాలలో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని పిలుపనిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి,జెడ్పీటీసీ గోరుపల్లి శారద, ఎంపీపీ రచ్చ కల్పన,మార్కెట్ చైర్మన్ కోనతం యాకుబ్ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ బి.వెంకటయ్య,మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మి నరసింహ రెడ్డి, జిల్లా పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్ రెడ్డి, సిడిపిఓ జ్యోస్త్న, వెలుగు సిబ్బంది, కౌన్సిలర్ లు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.