ఘనంగా ఊరడమ్మ పండుగ వేడుకలు
రామారెడ్డి జూన్ 3 (జనంసాక్షీ)
ఘనంగా ఊరడమ్మ పండుగ వేడుకలు నిర్వహించామని గ్రామ అభివృద్ధి అధ్యక్షుడు భరత్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో శుక్రవారం గ్రామ ప్రజల సహకారంతో గ్రామంలోని కొలువైన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకొని దేవతల కటాక్షం పొందామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజనర్సు, ఉప సర్పంచ్ అంజిరెడ్డి, వైస్ ఎంపీపీ రవీందర్ రావు, మండల ఎస్సీసెల్ టిఆర్ఎస్ అధ్యక్షుడు లింగం, సిహెచ్ రమేష్ ,రాజు ,సాకలి నరసింహులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు