ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
టేకులపల్లి, అక్టోబర్ 31 (జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలో ఏఐటీయూసీ 104 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మంగళవారం ఘనంగా కేక్ కట్ చేసి జరుపుకున్నారు. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు గుగులోతు రాంచందర్ మాట్లాడుతూ కార్మిక వర్గ పోరాటమే ఏఐటీయూసీ సంఘటిత, ఆసంఘటిత రంగం ఉద్యోగులకు ఈ 104 వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు ఔట్సోర్సింగ్ కార్మికులు, ఇతర రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఒక పండగలాగా కేక్ కట్ చేసి జరుపుకున్నారు. ఏఐటీయూసీ 1920లో బొంబాయి మహానగరంలో ఆవిర్భవించి నాటి నుంచి నేటి వరకు కార్మికుల పక్షంలో అనేక పోరాటాలు నిర్మించిన చరిత్ర ఏఐటియుసిదన్నారు. నాడు మహనీయులు సాధించిన హక్కులు నేడు నరేంద్ర మోడీ కాలరాస్తున్నాడని, బొగ్గు గనుల ప్రైవేట్ పరం చేస్తూ మరోపక్క కార్మిక చట్టాలను కాలరాస్తున్నడని కేంద్రం ఆవలబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని, నవంబర్ 30వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పేదల పక్షాన పోరాడే నాయకుల్ని చట్టసభలోకి పంపించవలసిన అవసరం ఎంతైనా ఉందని రాంచందర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గుగులోతు శ్రీను, ఐతం శ్రీరాములు, వాసం భద్రయ్య, బానోతు వీరన్న, తేజావత్ మధు, ఇస్లావత్ రవీందర్, తేజ వత్తు లక్ష్మణ్, గుగులోతు సోనీ తదితరులు పాల్గొన్నారు.