ఘనంగా కార్గిల్ సైనికులకు నివాళి

మఖ్తల్ జూలై 26 : (జనంసాక్షి) 23వ కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకొని షూటింగ్ బాల్, మాస్టర్స్ అథ్లెటిక్స్ , తగ్గాఫ్ వార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మక్తల్ మినీ స్టేడియం గ్రౌండ్ నుండి మఖ్తల్ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు క్రీడలలో శిక్షణ పొందుతున్న బాలబాలికలు జాతీయ జెండాలను చేత పట్టుకుని ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని గౌరవ అధ్యక్షుడు తాన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బి.గోపాలం జండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1999 మే 4 న మనదేశంలో చొరబడిన పాకిస్తాన్ ఉగ్రవాదులు సైనికులతో మన భారత సైన్యం 84 రోజులపాటు పోరాడి జూలై 26 న ఇండియా విజయం సాధించింది. మన భారత సైన్యం 527 మంది ప్రాణాలర్పించి జయకేతనం ఎగరవేశారు. పాకిస్తాన్ 4000 మంది సైనికులను మన భారత సైన్యము మట్టుపెట్టిన్నారు 1999 జులై 26 నుండి ప్రతి సంవత్సరము భారతదేశంలో వీరమరణం పొందిన 527 మంది సైనికులకు ఘన నివాళులు అర్పిస్తున్నాము. అంబేద్కర్ చౌరస్తాలో కార్గిల్ అమరవీరులకు కొవ్వొత్తులు వెలిగించి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు తాన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బి.గోపాలం ,అమ్రేష్, దామోదర్ ,రమేష్ కుమార్, B.రూప ,గురు స్వామి, మహమ్మద్ గౌస్ ,హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య, జయమ్మ ,నవనీత ,మంజుల, సిద్ధమ్మ, పాయల్, నవిత శ్రావణి వందమంది బాలబాలికలు పాల్గొన్నారు.