ఘనంగా కొమరం భీంకు నివాళులు
టేకులపల్లి,అక్టోబర్ 29 (జనం సాక్షి): కొమరం భీమ్ 83వ వర్ధంతి సందర్భంగా తుడుం దెబ్బ, ఏ ఈ డబ్ల్యూ సి ఏ ఆధ్వర్యంలో ఆదివారం టేకులపల్లి మండల కేంద్రంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏ ఈ డబ్ల్యు సి ఏ నాయకులు మెట్ల పాపయ్య మాట్లాడుతూ జల్ జంగిల్ జమీన్ ప్రదాత గోండు బిడ్డ కొమరం భీం ఆశయాలను కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన జల్ జంగిల్ జమీన్ పేద ప్రజలకు దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం నవాబులపై గర్జించి దేశ స్వాతంత్రంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆదివాసి ముద్దుబిడ్డ కొమరం భీముని ఈ సందర్భంగా ఆయన సేవలను కోనియాడారు. ఆయన పోరాటం ద్వారానే బ్రిటిష్ వారు హైకమాండర్ కమిషన్ ఏర్పాటు చేశారని, దాని ద్వారానే ఈరోజు ఆదివాసి ముద్దుబిడ్డలు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉద్యోగాలు అనుభవిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జాతీయ కో కన్వీనర్ కల్తి సత్యనారాయణ, ఏ ఈ డబ్ల్యు సి ఏ నాయకులు బుగ్గ రామనాధం, లక్ష్మినారాయణ, రాం బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.